varalaxmi sarathkumar: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వరలక్షి శరత్ కుమార్ - వెడ్డింగ్ రిసెప్షన్‌లో తారల సందడి
varalaxmi sarathkumar Wedding Reception Photos: నటి వరలక్ష్మి శరత్ కుమార్‌వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు.
జూలై 2న వరలక్ష్మి,నికోలయ్ సచ్‌దేవ్‌లు మూడుమూళ్ల బంధంతో ఒక్కటైనట్టు సమాచారం. ఇండస్ట్రీ ప్రముఖుల కోసం జూలై 3న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు.
ఈ రిసెప్షన్ సినీ ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. అలాగే వరలక్ష్మి వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఏపీ మాజీ మంత్రి, సినీ నటి ఆర్కే రోజా కూడా హజరై కొత్త జంటను ఆశీర్వాదించారు.
అలాగే టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్‌కు చెందిని స్టార్స్ అంతా కూడా వరలక్షి వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజర సందడి చేశారు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కన్నడ హీరో సుదీప్, హీరో సిద్ధార్థ్, మంచు లక్ష్మి, ప్రభుదేవా ఇలా పలువురు సినీ ప్రముఖులు వరలక్షి వెడ్డింగ్ రిసెప్షన్‌లో తళుక్కున మెరిసారు.
ఇందుకు సంబధించిన ఫోటోలను రోజా తన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. దీంతో వరలక్ష్మి రిసెప్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా కొద్ది రోజులుగా ఆమె పెళ్లి వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు నికోలయ్ సచ్‌దేవ్‌ను మార్చిలో నిశ్చితార్థం చేసుకుంది.
అప్పటి నుంచి ఆమె పెళ్లి న్యూస్ హాట్‌టాపిక్ అవుతుంది. కానీ, పెళ్లి ఎప్పుడు.. ఎక్కడ అనేది మాత్రం ఆఫీషియల్‌గా చెప్పకపోయినా.. ఆమె పెళ్లి హడావుడి మాత్రం బాగానే జరిగింది.