✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mercedes Benz EQA: త్వరలోనే ఇండియన్ మార్కెట్‌లోకి బెంజ్ EQA ఎలక్ట్రిక్‌ కార్, కంపెనీ రేంజ్‌కి తగ్గట్టుగానే స్పెసిఫికేషన్స్‌

Ram Manohar   |  03 Jul 2024 07:16 PM (IST)
1

యూత్‌ని దృష్టిలో పెట్టుకుని మెర్సిడెస్ బెంజ్ ఇండియా EQA పేరుతో ఎలక్ట్రిక్ కార్‌ని తయారు చేసింది. కళ్లు చెదిరే లుక్‌తో దీన్ని డిజైన్ చేసింది కంపెనీ. అందుబాటు ధరలో బెంజ్‌ కంపెనీ తయారు చేసిన చిన్న కార్ ఇది. ఇప్పటికే ఈ కార్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్‌ మార్కెట్‌లో మంచి బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి.

2

70.5KWH లాంగ్ రేంజ్ బ్యాటరీతో ఈ కార్‌ని తయారు చేశారు. ఈ కెపాసిటీతో ఓసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 560 కిలోమీటర్ల వరకూ దూసుకుపోవచ్చు. గరిష్ఠంగా గంటకి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు. మెర్సిడెస్ బెంజ్‌లో వచ్చిన SUVల్లో ఈ EQA 250+ చిన్నది. ఇంటీరియర్‌లో 11 KW AC ఛార్జర్‌,10.25 ఇంచుల రెండు స్క్రీన్‌లు, పానారోమిక్ సన్‌రూఫ్‌, 12 స్పీకర్లతో చాలా స్టైలిష్‌గా డిజైన్ చేశారు.

3

ఇందులో ఆగ్మెంటెండ్ రియాల్టీ మ్యాప్స్‌తో పాటు పవర్ అడ్జస్ట్‌మెంట్ మెమరీ సీట్స్‌ కూడా ఉన్నాయి. అంతకు ముందు బెంజ్‌లో వచ్చిన EQ మోడల్స్‌ మాదిరిగానే ఇందులోనూ ఏరో ఆప్టిమైజ్డ్‌ వీల్స్‌ని డిజైన్ చేశారు. ఇక కలర్స్ విషయానికొస్తే ఇందులో పోలార్ వైట్‌, నైట్ బ్లాక్, కాస్మోస్ బ్లాక్‌, మౌంటేన్ గ్రేతో పాటు హైటెక్ కలర్‌ కూడా ఉంది. వీటితో పాటు మరి కొన్ని కలర్స్‌లోనూ అందుబాటులోకి రానుంది.

4

ఇందులోని ఏసీ ఛార్జర్‌ 100% ఛార్జ్ అవ్వాలంటే కనీసం 7 గంటల 15 నిముషాల సమయం పడుతుంది. మరో స్పెషాల్టీ ఏంటంటే..ఈ కార్ డీసీ ఛార్జర్‌నీ సపోర్ట్ చేస్తుంది. 100 kW ఛార్జర్‌ కంపాటిబిలిటీ ఉంటుంది. ఇది 10-80% వరకూ కేవలం 35 నిముషాల్లోనే ఛార్జ్ అవుతుంది. వంద కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో క్రాస్ చేసేయొచ్చు.

5

ఎక్స్‌టీరియర్‌లో లైట్స్‌ని చాలా యునిక్‌గా డిజైన్ చేసింది కంపెనీ. టెయిల్ లైట్స్‌ని LED లైట్‌ బార్‌తో కనెక్ట్ చేసింది. ఇది చాలా స్పెషల్‌గా కనిపిస్తోంది. 19 ఇంచ్‌ల వీల్స్‌ మరో అట్రాక్షన్‌. చూడడానికి చిన్నగానే కనిపిస్తున్నా ఉన్నంతలో గ్రాండ్‌గా ఉండేలా రూపొందించారు.

6

సేఫ్‌టీ విషయానికొస్తే ఈ కార్‌లో మొత్తం ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ఇస్తోంది కంపెనీ. ఇదే హైలైట్‌ కానుంది. దీంతో పాటు 360 డిగ్రీల పార్క్ అసిస్టింగ్ కెమెరా కూడా ఉంది. బ్లైండ్‌ స్పాట్‌ అసిస్ట్‌ కెమెరాతో సహా అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్‌నీ ఇందులో చేర్చింది సంస్థ.

7

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కార్ కొన్న నాలుగేళ్ల తరవాత 67% అష్యూర్డ్‌ బైబ్యాక్ వాల్యూ ఇస్తోంది కంపెనీ. పెట్రోల్‌తో నడిచే కార్‌లకు వర్తించే ఈ ఆఫర్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌కీ వర్తిస్తుందని వెల్లడించింది. ఈ ఏడాదిలోనే దాదాపు 12 కొత్త ప్రొడక్ట్స్‌ లాంఛ్ చేస్తామని ప్రకటించింది. అందులో త్వరలోనే EQA వర్షన్ అందుబాటులోకి రానుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆటో
  • Mercedes Benz EQA: త్వరలోనే ఇండియన్ మార్కెట్‌లోకి బెంజ్ EQA ఎలక్ట్రిక్‌ కార్, కంపెనీ రేంజ్‌కి తగ్గట్టుగానే స్పెసిఫికేషన్స్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.