In Pics: పిల్లాడితో పవన్ కల్యాణ్, బుజ్జి ఫ్యాన్ కోసం కాన్వాయ్ ఆపి మరీ పలకరింపు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు తన శాఖల పని తీరుపై ఉన్నత స్థాయి అధికారులతో వరుస సమీక్షల్లో గడిపారు. ఇప్పుడు క్షేత్ర స్థాయి పరిశీలన మొదలుపెట్టారు. తనకు కేటాయించిన గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరాశాఖ పరిధిలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, తాగు నీటి శుద్ధి ప్లాంటుల పని తీరుని స్వయంగా పరిశీలించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉప్పాడ తీరానికి పవన్ కళ్యాణ్ వస్తున్నారన్న వార్త తెలియడంతో పిఠాపురం ఉప్పాడ మధ్య ప్రజలు రహదారుల వెంట బారులు తీరారు. తన కోసం వేచి ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లి మరీ పలకరించారు.
తమ కాలనీకి తాగునీటి సమస్య ఉందని, నీరు కొనుక్కుని తాగాల్సి వస్తుందని అక్కడ నివసిస్తున్న ప్రజలు పవన్ కళ్యాణ్ గారి ఎదుట వాపోయారు. పిఠాపురం నియోజకవర్గం, నాగులాపల్లి వద్ద సూరప్ప చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పవన్ పరిశీలించారు.
100 శాతం ప్రతి ఇంటికీ తాగునీరు అందించే లక్ష్యం దిశగా కార్యచరణలో భాగంగా ఆ స్టోరేజ్ ట్యాంకును సందర్శించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, తాగు నీటిని శుభ్రపరిచే విధానం, శుద్ది చేసిన నీటిని నిల్వ ఉంచే ట్యాంకు, నీటి స్వచ్ఛత పరీక్షలు జరిపే పరిశోధనా కేంద్రాలను పరిశీలించారు.
పెరిగిన నీటి అవసరాలకు తగ్గట్టు ట్యాంకు విస్తరణకు రూ. 12 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయని, సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. జల్ జీవన్ మిషన్ నిధుల గురించి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆరా తీశారు.
కొండెవరం గ్రామ పరిసరాల్లో ఓ బాలుడు జనసేన జెండా ఊపుతూ అభివాదం చేస్తుంటే.. తన కాన్వాయ్ నిలిపి ఆ బాలుడిని పలకరించారు. కాన్వాయ్ నిలిపి చిన్నారిని పలకరించడం గ్రామస్తులను అబ్బురపరచింది.