Janhvi Kapoor: తిరుమలలో నయా అతిలోక సుందరి... హాఫ్ శారీలో ముద్దు ముద్దుగా జాన్వీ పాప
జాన్వీ కపూర్ మోడ్రన్ సినిమాలు చేస్తున్నారు. మోడ్రన్ డ్రస్సులు ధరిస్తున్నారు. కానీ ఆవిడ చాలా ట్రెడిషనల్. ముఖ్యంగా భక్తి విషయంలో! తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే ఆవిడకు అమితమైన భక్తి. తరచూ తిరుమల స్వామి వారి దర్శనం చేసుకుంటారు. న్యూ ఇయర్ సందర్భంగా తిరుమల వెళ్లారు జాన్వీ కపూర్. ఆవిడ చేతిలో లడ్డూ చూశారా?
Download ABP Live App and Watch All Latest Videos
View In App'హ్యాపీ న్యూ ఇయర్' అంటూ జాన్వీ కపూర్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. హాఫ్ శారీలో జాన్వీ పాప ముద్దు ముద్దుగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
'దేవర' సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు. శ్రీదేవిని తెలుగు ప్రేక్షకులు అతిలోక సుందరి అనేవారు. ఇప్పుడు జాన్వీని నయా అతిలోక సుందరి అంటున్నారు.
'దేవర' తర్వాత రామ్ చరణ్ సినిమా చేసే అవకాశం అందుకున్నారు జాన్వీ కపూర్. 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ నటిస్తున్న సినిమాలో జాన్వీ హీరోయిన్.