Singer Armaan Malik: పెళ్లి పీటలు ఎక్కిన 'బుట్ట బొమ్మ' సింగర్ అర్మాన్ మాలిక్ - ఆ అమ్మాయి ఎవరంటే?
అర్మాన్ మాలిక్... ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులు ఠక్కును గుర్తుపట్టడం కష్టమేమో!? కానీ ఆయన పాటలు ప్రేక్షకులకు తెలుసు. 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్ట బొమ్మ...' పాట పాడింది ఆయనే. 'వకీల్ సాబ్' సినిమాలో 'కంటి పాప...' సాంగ్ కూడా అర్మాన్ మాలిక్ పాడారు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో 'గుచ్చే గులాబీ...' సాంగ్ కూడా! ఇప్పుడు ఈ సింగర్ ఓ ఇంటివాడు అయ్యారు. ఈ రోజు పెళ్లి చేసుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతనకు పెళ్లి అయిన విషయాన్ని అర్మాన్ మాలిక్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇంతకీ ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
అర్మాన్ మాలిక్ భార్య పేరు ఆష్నా ష్రాఫ్. అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అర్మాన్ వయసు 29 ఏళ్లు కాగా... అతడి కంటే ఆమె రెండేళ్లు పెద్దది అని, ఆవిడ వయసు 31 ఏళ్లు అని బాలీవుడ్ చెబుతోంది.
తు మేరా ఘర్... (ఇకనుంచి నువ్వే నా ఇల్లు) అని పెళ్లి ఫోటోలను అర్మాన్ మాలిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
హిందీలో 'తారే జమీన్ పర్', 'కి అండ్ క', 'ఎంఎస్ ధోని' వంటి పలు సినిమాలలో అర్మాన్ మాలిక్ పాటలు పాడారు. ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.