Aditi Rao Hydari Siddharth Wedding: పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
Siddharth Marriage Photos: 'నువ్వే నా సూర్యుడివి, నువ్వే నా చంద్రుడివి, నువ్వే నా నక్షత్రాలు' అంటూ సిద్ధార్థ్ గురించి ఇంగ్లీష్ పోయెట్రీ రాశారు అదితి రావు హైదరి. ఈ ఫోటో చూస్తే అసలు విషయం అర్థం అయ్యింది కదూ! అవును... వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమిసెస్ అదితి రావు హైదరి అండ్ మిస్టర్ సిద్ధార్థ్ అంటూ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిందీ జంట! తామిద్దరం పెళ్లి చేసుకున్నామని ఈ రోజు (సోమవారం, సెప్టెంబర్ 16న) ప్రకటించింది.
తెలంగాణలోని వనపర్తి సంస్థానానికి చెందిన వారసురాలు అదితి రావు హైదరి. ఆ వంశానికి చెందిన ఆలయంలో సిద్ధార్థ్ తో ఆవిడ ఏడు అడుగులు వేశారు. పెళ్లి తర్వాత గుడి ప్రాంగణంలో ఇలా ఫోటోలు దిగారు.
పెళ్లిలో సిద్దార్థ్, అదితి రావు హైదరి నవ్వులు. ఈ ఏడాది మార్చి నెలాఖరున వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు ప్రచారం జరిగింది. అయితే... తాము పెళ్లి చేసుకోలేదని, నిశ్చితార్థం మాత్రమే జరిగిందని క్లారిటీ ఇచ్చారు.
సెప్టెంబర్ 16న సిద్దార్థ్, అదితి రావు హైదరి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, కొంత మంది స్నేహితులు మాత్రమే హాజరైనట్టు తెలిసింది.
నూతన దంపతులు సిద్ధార్థ్, అదితి రావు హైదరికి పలువురు చిత్రసీమ ప్రముఖులు, ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
'మహాసముద్రం' సినిమా చిత్రీకరణలో సిద్దార్థ్, అదితి రావు హైదరి మధ్య పరిచయం జరిగింది. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్ చేశారు. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి అయ్యారు.