Sivaji - Laya: హిట్ జోడీ రిపీట్ - శివాజీ, లయ జంటగా క్రైమ్ కామెడీ థ్రిల్లర్
హీరో హీరోయిన్లుగా శివాజీ లయ జంటకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 'మిస్సమ్మ', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'అదిరిందయ్యా చంద్రం'... బాక్సాఫీస్ బరిలో ఈ జోడీ హ్యాట్రిక్ హిట్స్ అందుకోవడమే కాదు, ప్రశంసలు సైతం సొంతం చేసుకుంది. కొంత విరామం తర్వాత ఈ శివాజీ, లయ మళ్ళీ జంటగా నటించనున్నారు. కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశివాజీ, లయ జంటగా నటిస్తున్న కొత్త సినిమా శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకం మీద ప్రొడక్షన్ నెం 2గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి శివాజీ నిర్మాత. అగ్ర నిర్మాత 'దిల్' రాజు క్లాప్ ఇవ్వగా... పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.
శివాజీ, లయ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు 'దిల్' రాజు, బెక్కెం వేణుగోపాల్, దర్శకుడు బోయపాటి శ్రీను చేతుల మీదుగా చిత్ర బృందం స్క్రిప్ట్ అందుకుంది. శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సుధీర్ శ్రీరామ్ అని కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి శివాజీయే నిర్మాత కావడం విశేషం.
శివాజీ, లయ జంటగా నటించనున్న ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. మిగతా వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.