Gopichand Bhimaa Stills: ఖాకి చొక్కాలో కొత్తగా గోపీచంద్ - 'భీమా'లో స్టిల్స్ చూశారా?
గోపీచంద్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'భీమా'. మార్చి 8న... అంటే ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అవుతోంది. ఇందులో మాళవికా శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఏ హర్ష దర్శకత్వంలో కెకె రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. థియేటర్లలో సినిమా చూడటానికి ముందు హీరో స్టిల్స్ చూడండి.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGopichand Police Movies List: 'భీమా' సినిమాలో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ఇంతకు ముందు కూడా ఆయన ఖాకీ చొక్కా వేశారు. 'ఆంధ్రుడు', 'గోలీమార్', 'శౌర్యం' సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్స్ చేశారు. గోపీచంద్ పోలీసుగా కనిపిస్తున్న నాలుగో సినిమా 'భీమా'. ఇంతకు ముందు సినిమాలకు, ఈ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంటుందని, దర్శకుడు తనను కొత్తగా చూపించడంతో పాటు సెమీ ఫాంటసీ ఎలిమెంట్ యాడ్ చేయడంతో భీమా క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులకు గుర్తుంటుందని గోపీచంద్ చెప్పారు.
'భీమా' ట్రైలర్ మాసీగా ఉండటంతో పాటు సంథింగ్ డిఫరెంట్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగించింది. దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి, ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.
'భీమా' కోసం గోపీచంద్ మీసం పెంచారు. దాంతో పాటు కొంచెం స్లిమ్ అయ్యారు. ఈ మధ్య ఇంటర్వ్యూలో ఆ విషయం అడిగితే 'బరువు తగ్గడం కష్టం కానీ పెరగడం ఈజీ' అని చెప్పుకొచ్చారు గోపీచంద్.
'భీమా' దర్శకుడు కన్నడిగ అయినప్పటికీ... తెలుగులోనే సినిమా తీశారు. ముందు నుంచి తాము తెలుగులో సినిమా తీయాలనుకున్నామని, కన్నడనాట తెలుగు సినిమాలు పెద్ద ఎత్తున విడుదల అవుతాయి కనుక డబ్బింగ్ చేయలేదని ప్రొడ్యూసర్ రాధామోహన్ చెప్పారు.
'భీమా' సినిమాలో గోపీచంద్ స్టిల్స్
'భీమా' సినిమాలో గోపీచంద్ స్టిల్స్