Amritha Aiyer Latest Photos: ట్రేడిషనల్ లుక్‌లో ఫిదా చేస్తున్న హనుమాన్ భామ అమృత అయ్యార్
Amritha Aiyer: దళపతి విజయ్, డైరెక్టర్ అట్లీ కాంబోలో వచ్చిన బిగిల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృతా అయ్యార్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ.
ఆ తర్వాత స్టార్ యాంకర్ ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచమైంది అమృతా.
ఆ తర్వాత టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు సరసన అర్జున ఫల్గుణ చిత్రంలో నటించింది.
ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించకపోయినా అమృత అందం, నటనకు మంచి మార్కులే పడ్డాయి.
తనకు సెట్ అయ్యే పాత్రలు ఏవీ వచ్చినా చేస్తానంటోన్న ఈ కన్నడ బ్యూటీ.. గ్లామర్ రోల్స్ తనకు కంఫర్టబుల్ కాదంటుంది
వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్న అమృత తేజ్ సజ్జాతో కలసి నటించిన హనుమాన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది
హనుమాన్ మూవీలో అమృత.. డాక్టర్‌గా పవర్ఫుల్ పాత్రలో నటించిన మెప్పించింది. ఈ సినిమాలో లంగాఓణీలు వేసి ట్రేడిషనల్కు లుక్ లుక్‌తో ఆకట్టుకుంది.
అలాగే సోషల్ మీడియాలోపై ఈ కన్నడ భామ తన ట్రేడిషన్ లుక్‌తో కుర్రకారు ఫిదా చేస్తుంది.