Dhruv Vikram : విక్రమ్ యంగ్ వెర్షన్‌లా ధృవ్.. సరైన బ్రేక్ వస్తే తండ్రినే మించిపోతాడంటోన్న ఫ్యాన్స్
చియాన్ విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేశాడు. వాటిని చూసిన నెటిజన్లు విక్రమ్ యంగ్ వెర్షన్‌లా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. (Image Source : Instagram/Dhruv Vikram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసన్‌కిస్డ్, డార్క్ థీమ్‌లో ధృవ్ తన లేటెస్ట్ ఫోటోషూట్ చేశాడు. బైక్ పక్కన కూర్చొని.. సీరియస్ లుక్‌లో, కొన్ని ఫోటోల్లో క్యూట్‌గా నవ్వేస్తూ ఫోజులిచ్చాడు. (Image Source : Instagram/Dhruv Vikram)
ఈ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసి.. Glimmers in 2025 అంటూ ఫోటోలు షేర్ చేశాడు. ఈ ఫోటోలకు నెటిజన్లు జూనియర్ విక్రమ్, విక్రమ్ యంగ్ వెర్షన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (Image Source : Instagram/Dhruv Vikram)
విక్రమ్ తనయుడిగా కెరీర్‌ను ప్రారంభించిన ధృవ్.. ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి హీరోగా ఎదిగాడు.(Image Source : Instagram/Dhruv Vikram)
అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్లో రీమేక్ చేశాడు ధృవ్. ఆ సినిమా రిలీజ్ విషయంలో కొన్ని కాంట్రవర్సీలు జరిగినా.. ఆదిత్య వర్మ సినిమాతో తనలోని నటుడిని స్క్రీన్‌పై మంచిగా చూపించాడు ధృవ్.(Image Source : Instagram/Dhruv Vikram)
అనంతరం మహాన్ సినిమాలో తండ్రితో కలిసి.. తండ్రినే డామినేట్ చేసేలా నటించాడు ధృవ్. ఈ సినిమాకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందాడు. ప్రస్తుతం బిసోన్ సినిమాతో బిజీగా ఉన్నాడు ధృవ్. ఇతను కేవలం నటుడే కాదండోయ్. పలు సాంగ్స్ కూడా పాడాడు. తెలుగులో హాయ్ నాన్నలోని ఓడియమ్మ సాంగ్ పాడింది ఇతనే. (Image Source : Instagram/Dhruv Vikram)