Veera Dheera Sooran Teaser: కాళీ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు విక్రమ్ రెడీ - 'వీర ధీర శూరన్' టీజర్ రిలీజ్ ఎప్పుడంటే?
విలక్షణ నటుడు 'చియాన్' విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'వీర ధీర శూరన్'. హెచ్.ఆర్.పిక్చర్స్ పతాకం మీద ఎస్‌యు రియా శిబు నిర్మిస్తున్నారు. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకుడు. హీరోగా విక్రమ్ 62వ చిత్రమిది. ఇందులో ఆయన కాళీ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆల్రెడీ టైటిల్ టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు మరో అసలు సిసలైన టీజర్ విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడిసెంబర్ 7న 'వీర ధీర శూరన్' టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. విక్రమ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, ఇప్పుడు కాళీ ప్రపంచంలోకి తీసుకు వెళతామని చెప్పారు.
'వీర ధీర శూరన్'లో ఎస్.జె. సూర్య పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ఇందులో దుషారా విజయన్ హీరోయిన్. మలయాళ నటుడు సిద్దిఖీ కీలక పాత్రలో నటిస్తున్నారు.
'వీర ధీర శూరన్' చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. విక్రమ్, ఆయనది సూపర్ హిట్ కాంబినేషన్.
'వీర ధీర శూరన్' సినిమాలో చియాన్ విక్రమ్, దుషారా విజయన్.