అవును.. మలైకా అరోరా - అర్జున్ కపూర్ కలిసే ఉన్నారు, ఇదిగో క్లారిటీ!
49 ఏళ్ళ సీనియర్ బ్యూటీ మలైకా, వయసులో తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేయడం అనేది బాలీవుడ్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగత కొన్నేళ్లుగా సహజీవనం సాగిస్తున్న ఈ జంట.. ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ, వీలు కుదిరినప్పుడల్లా హాలిడేని ఎంజాయ్ చేస్తూ వార్తల్లో ఉంటున్నారు.
ఇటీవల కాలంలో మలైకా అరోరా - అర్జున్ విడిపోయారని రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మలైకాకు అర్జున్ గుడ్ బై చెప్పేశాడని, మరో మగువతో డేటింగ్ కూడా మొదలుపెట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఎట్టకేలకు ఈ జంట పుకార్లకు చెక్ పడింది. ఆదివారం మలైకా-అర్జున్ కపూర్ కలిసి ఓ రెస్టారెంట్ లో డిన్నర్ చేసి బయటకు వస్తూ కెమెరాల కంటపడ్డారు.
తాజా ఫోటోలు వీరిద్దరూ విడిపోలేదనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దీంతో వారి బంధానికి బీటలు వాలాయి అంటూ ఇన్నాళ్లూ వినిపిస్తున్న రూమర్స్ కు బ్రేక్ పడినట్లయింది.
ఈ మధ్య నటి, సోషల్ మీడియాల్ ఇన్ ఫ్లూయన్సర్ కుషా కపిలతో అర్జున్ కపూర్ ప్రేమలో పడ్డాడని, మలైకాకు దూరం అవుతున్నాడని ఈ మధ్య వార్తలు వచ్చాయి.
రీసెంట్ గా కుషా తన భర్తకు విడాకులివ్వడంతో ఈ ఊహాగానాలు మరింతగా పెరిగాయి.. అర్జున్ - అరోరా విడిపోయారనే ప్రచారం కూడా ఊపందుకుంది.
అర్జున్ ను మలైకా ఇన్స్టాగ్రామ్ లో అన్-ఫాలో చేసిందని, అర్జున్ చెల్లెలు జాన్వి కపూర్ ను కూడా అన్-ఫాలో చేసి పూర్తిగా కపూర్ కుటుంబానికి దూరం జరిగిందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.
అయితే ఇప్పుడు మలైకా - అర్జున్ జంట కలిసి కనిపించి అన్నిటికీ క్లారిటీ ఇచ్చారు. రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత మలైకా ఇంటికి వెళ్లిపోయారు.
బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో అర్జున్ కపూర్, పొట్టి నిక్కరులో ఉన్న మలైకా అరోరా ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.