ఉంగరాల అనసూయగా మారిపోయిన రంగమ్మత్త.. వైరల్ అవుతున్న అందాల యాంకర్ ఫోటోలు!
సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే అనసూయ.. సినిమా సంగతులతో పాటుగా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు, వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇద్దరు పిల్లల తల్లైనా కూడా అనసూయ తన అందాలతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎవరైనా నెగిటివ్ కామెంట్లు పెట్టినా, ట్రోల్స్ చేసినా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ వస్తోంది.
ఆమె నటించిన 'ప్రేమ విమానం' సినిమా జీ5 ఓటీటీలో విడుదల అవుతున్న నేపథ్యంలో, తాజాగా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
'ప్రేమ విమానం' డే కాబట్టి నా స్వంత పాటలకు డ్యాన్స్ చేస్తున్నాను అంటూ అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
గ్రీన్ కలర్ కుర్తా సెట్ ధరించి, చేతి నిండా ఉంగరాలు మరియు చెవులకు పెద్ద రింగులు పెట్టుకొని క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది.
కన్ను గీటుతూ, ఫ్లయింగ్ కిస్ ఇస్తూ, లవ్ సింబల్ చూపిస్తూ, తలపై కొమ్ములు పెట్టుకుంటూ అదిరిపోయే ఫోజులు ఇచ్చింది.
అనసూయ లేటెస్ట్ ఫోటోలకు లక్షల కొలదీ లైక్స్ వస్తున్నాయి. ఉంగరాల అనసూయగా మారిపోయిన రంగమ్మత్త అంటూ నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
2003లో 'నాగ' చిత్రంతో తెరంగేట్రం చేసిన అనసూయ.. కొన్నాళ్లపాటు తెలుగు న్యూస్ ఛానల్ సాక్షి టీవీలో వ్యాఖ్యాతగా పని చేసింది. ఈటీవీలో వచ్చే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.
ఇక 2016లో 'సోగ్గాడే చిన్ని నాయనా' తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. 'క్షణం'లో విలన్ గా, 'రంగస్థలం'లో రంగమ్మత్తగా మెప్పించింది. 'పుష్ప'తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది.
అనసూయ ప్రస్తుతం 'పుష్ప 2' తో పాటుగా 'ఫ్లాష్ బ్యాక్' అనే తమిళ్ మూవీలో నటిస్తోంది. ఆమె ప్రధాన పాత్ర పోషించిన 'రజాకార్' సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.