Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
'పుష్ప 2' బ్లాక్ బస్టర్ సాధించిన సందర్భంగా ఇవాళ హైదరాబాద్ సిటీలో సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ఏపీలో టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ చెప్పారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత థాంక్యూ కళ్యాణ్ బాబాయ్ అన్నారు. అదే సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా థాంక్స్ చెప్పారు. అయితే, ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని క్లిప్స్ చూస్తే... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయినట్టు ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే... ఎక్కువ సేపు మాట్లాడటం వల్ల మంచినీళ్లు తాగడం కోసం గ్యాప్ ఇచ్చారు. దానికి ముందు తెలంగాణ సీఎం అనడంతో రేవంత్ రెడ్డి పేరు మార్చుపోవడం అనేది వైరల్ అవుతోంది.
ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ బన్నీకి తెలుసు. కానీ, ఆయన పూర్తి పేరు తెలియదు. సభావేదిక మీద పూర్తి పేరు చెప్పడం సభ్యత అని ఆయన పేరు అడిగి తెలుసుకుని మరీ చెప్పారు. దాన్ని కూడా కవర్ డ్రైవ్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
'పుష్ప 2' సినిమా 500 కోట్ల క్లబ్బులో చేరింది. ఇండియన్ సినిమా హిస్టరీలో తక్కువ టైంలో ఆ కలెక్షన్స్ చేరిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
సినిమా విజయం సాధించినప్పటికీ... అభిమాని మృతి తనను ఎంతో కలచి వేసిందని అల్లు అర్జున్ అన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానని మరోసారి తెలిపారు. ఆల్రెడీ 25 లక్షల డొనేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.