Aditi rao Siddharth Marriage : కలిసి రెండోసారి పెళ్లి చేసుకున్న అదితీ రావ్, సిద్ధార్థ్.. ఈసారి డ్రీమ్ వెడ్డింగ్ అట
రెడ్ కలర్ భారీ లెహంగాలో పెళ్లికూతురుగా ముస్తాబైన అదితీ రావు హైదరీ.. వైట్ కలర్ కుర్తాలో స్టైలిష్‌గా ముస్తాబైన సిద్ధార్థ్.. మరోసారి పెళ్లి చేసుకుని.. కొత్త జీవితాన్ని మరోసారి వెల్కమ్ చేశారు. (Images Source : Instagram/Aditirao Hydari Siddharth)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగతంలో ట్రెడీషనల్ పద్ధతిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఈ స్టార్ జంట.. తాజాగా డ్రీమీ స్టైల్లో తమ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకున్నారు. గతంలోనే మాదిరిగానే ఎలాంటి బజ్ లేకుండా ఈ తంతును ముగించారు. (Images Source : Instagram/Aditirao Hydari Siddharth)
పెళ్లికి సంబంధించిన ఫోటోలను అదితీ, సిద్ధార్థ్ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. The best thing to hold on to in life is each other ❤️ అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశారు.(Images Source : Instagram/Aditirao Hydari Siddharth)
వీరు ఈ వెడ్డింగ్ కోసం రాజస్థాన్ వెళ్లారు. అక్కడ అలీలా ఫోర్ట్‌లో పెళ్లి చేసుకుని.. ఫోటోలకు రోమాంటిక్‌గా ఫోజులిచ్చారు. (Images Source : Instagram/Aditirao Hydari Siddharth)
మహా సముద్రం సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ.. డేటింగ్ చేశారు. అనంతరం సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని.. తమ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు. (Images Source : Instagram/Aditirao Hydari Siddharth)
పెళ్లిని కూడా సీక్రెట్‌గానే ఉంచి.. తక్కువమంది సమక్షంలో ఓ గుడిలో సింపుల్‌గా చేసుకున్నారు. ఇప్పుడు డ్రీమ్ వెడ్డింగ్‌ని గ్రాండ్‌గా చేసుకున్నారు కానీ.. దీనిని కూడా సీక్రెట్‌గానే మెయింటైన్ చేసి సక్సెస్ అయ్యింది ఈ జంట.(Images Source : Instagram/Aditirao Hydari Siddharth)