రెండు బ్లాస్టింగ్ ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసిన మహీంద్రా - ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6ఈ వచ్చేశాయ్!
మహీంద్రా భారతదేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసింది. అవే మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, మహీంద్రా బీఈ 6ఈ. త్వరలో వీటికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎక్స్ షోరూం ధర రూ.21.9 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 2025 జనవరి నుంచి ఈ కారుకు సంబంధించిన డెలివరీలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
59 కేడబ్ల్యూహెచ్, 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లలో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈని కొనుగోలు చేయవచ్చు. 79 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ ఏకంగా 656 కిలోమీటర్ల రేంజ్‌ను డెలివర్ చేయనుంది.
మహీంద్రా బీఈ 6ఈ ఎక్స్ షోరూం ధర రూ.18.9 లక్షల నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన డెలివరీలు కూడా 2025లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
59 కేడబ్ల్యూహెచ్, 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో మహీంద్రా బీఈ 6ఈని కొనుగోలు చేయవచ్చు. వీటిలో 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ మోడల్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 682 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.
ఈ రెండు కార్లూ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. ఫాస్ట్ ఛార్జర్ల ద్వారా 20 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ కేవలం 20 నిమిషాల్లోనే ఎక్కనున్నాయి.