PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో పలు రాష్ట్రాల నేతలు వరుస భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, త్వరలో రాష్ట్రంలో తాము అధికారం లోకి వస్తాయని దీమా వ్యక్తం చేశారు.
తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, బీజేపీ శాసనసభ్యులు, ఇతర కీలక నేతలు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశంలో తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీ వారితో చర్చించారు.
రాష్ట్రంలో బీజేపీ ఉనికి వేగంగా పెరుగుతోందని, పార్టీ అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని, మరోవైపు బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు దారుణ అనుభవాలు ఉన్నాయంటూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే తెలంగాణ ప్రజలు ఎంతో ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారని రాష్ట్ర బీజేపీ నేతలతో జరిగిన భేటీలో మోదీ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భాజపా గట్టి స్వరం వినిపిస్తూనే ఉంటుంది. మా కార్యకర్తలు మా అభివృద్ధి ఎజెండాను వివరిస్తూనే ఉంటారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బీజేపీ తమ స్వరం గట్టిగి వినిపిస్తోందన్నారు. బీజేపీ కార్యకర్తలు, నేతలు తమ అభివృద్ధి అజెండాలను ఎల్లప్పుడూ ప్రజలకు వివరిస్తూనే ఉంటారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.