Sameera Reddy: శారీలో మెరిసిన సీనియర్ బ్యూటీ.. సమీరా సొగసు చూడతరమా!
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమీరా.. రెగ్యులర్ గా తన ఫోటోలను, వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇటీవల సమీరా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తున్న ఆమె అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.
సమీరా రెడ్డి రాజమండ్రికి చెందిన అమ్మాయి అయినప్పటికీ, ఫ్యామిలీ ముంబైలో సెటిల్ అవ్వడంతో అక్కడే పెరిగింది.
'మైనే దిల్ తుజ్కో దియా' అనే హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. 'డర్నా మనా హై' 'ప్లాన్' 'ముసాఫిర్' 'రేస్' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.
'నరసింహుడు' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సమీరా.. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు జోడీగా నటించింది.
'జై చిరంజీవ', 'అశోక్', 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది.
తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, మలయాళ కన్నడ, బెంగాలీ భాషల్లో హీరోయిన్ గా నటించింది సమీరా. రెండు మ్యూజిక్ వీడియోలు కూడా చేసింది.
ఈ అందాల భామ తెలుగులో చివరిగా 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమాలో రానా - వెంకటేష్ లతో కలిసి ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది.
సమీరా రెడ్డి 2014 లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వార్దేని ప్రేమ వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత నటనకు దూరమైన ఆమె, ఫ్యామిలీకే తన పూర్తి సమయాన్ని కేటాయించింది. తన ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటోంది.
సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ వస్తోంది.
మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకు రీఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి కానీ.. అవన్నీ అవాస్తవమని, ప్రస్తుతానికి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారని సమీరా రెడ్డి స్పష్టం చేసింది.