Rajisha Vijayan: రజిషా విజయన్ గ్లామర్ డ్యూటీ... స్పాట్ లైట్లో మలయాళీ భామ అందం
Rajisha Vijayan Instagram Photos: తెలుగు ప్రేక్షకుల కొందరికి అయినా రజిషా విజయన్ తెలిసే ఉంటారు. మాస్ మహారాజా రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో ఆవిడ ఓ హీరోయిన్ కనుక. ఆ మూవీలో సంప్రదాయబద్ధమైన పాత్రలో కనిపించారు. అందువల్ల, ఈ ఫోటోస్ చూసి గుర్తు పట్టడం కాస్త కష్టం ఏమో! (Image Courtesy: rajishavijayan / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో మాత్రమే కాదు... మలయాళ సినిమాల్లోనూ, ఆ తర్వాత ప్రచార కార్యక్రమాల్లోనూ ట్రెడిషనల్ లుక్ లో కనిపించేందుకు రజిష ఇంపార్టెన్స్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకు ఈ స్థాయి గ్లామర్ ఫోటోషూట్ ఆమె అసలు చేయలేదు. (Image Courtesy: rajishavijayan / Instagram)
సంప్రదాయబద్ధంగా కనిపించే రజిషా విజయన్ ఒక్కసారిగా గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడంతో సోషల్ మీడియా షాక్ అయ్యింది. 'Bring on the spotlight' అని ఈ ఫోటోలకు రజిష క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు షేర్ చేశాక ఆవిడ గ్లామర్ స్పాట్ లైట్ కిందకు వచ్చిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. (Image Courtesy: rajishavijayan / Instagram)
మలయాళంలో డజనుకు పైగా సినిమాలు చేసిన రజిషా విజయన్, ఇప్పుడు కార్తీ 'సర్దార్ 2'లో నటిస్తున్నారు. (Image Courtesy: rajishavijayan / Instagram)