Anupama Parameswaran: ఏడేళ్ల కిందట అనుపమా ఇలా, ఫొటోలు షేర్ చేసిన ‘ప్రేమమ్’ బ్యూటీ!

అనుపమా పరమేశ్వరన్.. ఈ పేరు వినగానే కుర్రాళ్ల గుండెల్లో వీనలు మోగుతాయి. ఆమె నవ్వులు మురిపిస్తాయి.. ఆమె చూపులు చురకత్తుల్లా గుచ్చుకుంటాయి. తన క్యూట్‌నెస్‌తో హార్ట్‌ను క్రష్ చేసే ఈ బ్యూటీ సినిమాల్లోకి వచ్చి అప్పుడే ఏడేళ్లు అయిపోతుంది. ఈ సందర్భంగా ఆమె అప్పటి ఫొటోలను తన సోషల్ మీడియా ఫాలోవర్లతో పంచుకుంది. 2015లో విడుదలైన ‘ప్రేమమ్’ సినిమాతో అను ఎంతమందికి నిద్రలేకుండా చేసిందో తెలిసిందే. ఆ క్రేజ్‌తో ఆమెను 2016లో దర్శకుడు త్రివిక్రమ్ ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం చేశారు. కానీ, ఆమె నటించిన నాగవల్లి పాత్ర కొందరు ప్రేక్షకులకు నచ్చలేదు. ఆ వెంటనే ఆమె ‘ప్రేమమ్’ తెలుగు రీమేక్‌లో కనిపించింది. దీంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. ఆ తర్వాత ‘శతమానం భవతి’ సినిమాలో మెరిసింది. అనంతరం వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టాయి. ఆమె నటించిన ‘రాక్షసుడు’ చిత్రం టాలీవుడ్లో ఆమెకు పెద్ద హిట్ ఇచ్చింది. ఆ తర్వాత అను ‘హెలో గురు ప్రేమ కోసమే’ సినిమాతో మెస్మరైజ్ చేసింది. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో అను హద్దులు చెరిపేసి ముద్దులతో రెచ్చిపోయింది. ప్రస్తుతం అనూ చేతిలో మూడు తెలుగు చిత్రాలు ఉన్నాయి. ‘18 పేజెస్’, ‘కార్తికేయ 2’, ‘బటర్ ఫ్లై’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతాయి. ఇప్పుడు అనూ కెరీర్ ఆ మూడు చిత్రాలపైనే ఆధారపడి ఉంది. మరి అనుపమా షేర్ చేసిన ఏడేళ్ల నాటి ఫొటోలు చూసేద్దామా. - Image Credit: Anupama Parameswaran/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App
అనుపమా పరమేశ్వరన్ ‘ప్రేమమ్’ ఫొటోలు - Image Credit: Anupama Parameswaran/Instagram