Telugu Warriors: కర్ణాటక బుల్డోజర్స్‌పై తెలుగు వారియర్స్ విక్టరీ - కానీ ప్లేఆఫ్స్‌లో నో ప్లేస్!
సీసీఎల్ 2024లో తెలుగు వారియర్స్ ప్రయాణం ముగిసింది. ఆదివారం కర్ణాటక బుల్డోజర్స్తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ నాలుగు వికెట్లతో విజయం సాధించింది. దీంతో టోర్నమెంట్‌ను విజయంతో ముగించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆదివారం మొదటి మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్, తెలుగు వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ గెలవడంతో ప్లేఆఫ్స్ ఆశలు అప్పటికీ సజీవంగా నిలిచాయి.
కానీ తర్వాతి మ్యాచ్‌లో కేరళ స్ట్రైకర్స్‌పై చెన్నై రైనోస్ తొమ్మిది వికెట్లతో విజయం సాధించింది. మిగిలిన ఏకైక ప్లేఆఫ్స్ బెర్తును మెరుగైన నెట్ రన్‌రేట్‌తో ఎగరేసుకు పోయింది.
2023లో సీసీఎల్ ట్రోఫీని గెలుచుకున్న తెలుగు వారియర్స్ ఈ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది.
కానీ ప్లేఆఫ్స్‌కు కూడా చేరకుండా ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, ముంబై హీరోస్ జట్లు ప్లేఆఫ్స్‌లో తలపడనున్నాయి.
సీసీఎల్ 2024 క్లైమ్యాక్స్‌లో వైజాగ్‌లో జరగనుంది. 15, 16 తేదీల్లో ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు, ఫైనల్స్‌కు విశాఖ పట్నం వేదిక కానుంది.