Supritha Naidu in Bigg Boss: ‘బిగ్ బాస్’లోకి సురేఖా వాణి కూతురు? ఇక కుర్రాళ్లకు పండగే!
సుప్రిత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సురేఖా వాణి ముద్దుల కుమార్తె ఆమె.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅమ్మడు వెండితెర మీదకు రాకుండానే విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో తన హాట్ ఫొటో షూట్స్, వీడియోలను పోస్ట్ చేస్తూ నెట్టింట హీట్ పెంచేస్తుంది.
చిట్టి పొట్టి దుస్తుల్లో అందాలు ఆరబోస్తూ యువ హృదయాలను కొల్లగొడుతుంది.
హీరోయిన్ కు ఏమాత్రం తగ్గని అందం తన సొంతమని సామాజిక మాధ్యమాల వేదికగా నిరూపిస్తూ ఉంటుంది.
సురేఖ వాణి - సుప్రితలు తల్లీ కూతుర్ల మాదిరిగా కాకుండా, స్నేహితులుగా మెలుగుతుంటారు.
ఇద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేయడమే కాదు.. ప్రైవేట్ పార్టీలు, పబ్బులకు వెళ్లి చిల్ అవుతుంటారు.
గతంలో సుప్రీత తన తల్లితో కలిసి స్టెప్పులేసిన వీడియోలు ఇంటర్నెట్ లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.
సురేఖ వాణి కూతురు త్వరలోనే తెరంగేట్రం చేయనుందని భావిస్తున్న తరుణంలో.. 'బిగ్ బాస్' షోలో ఎంట్రీ ఇవ్వనుందనే న్యూస్ వైరల్ అవుతోంది.
ఇందులో నిజమెంతో తెలియదు కానీ, ఒకవేళ సుప్రీత 'బిగ్ బాస్' లో అడుగుపెడితే మాత్రం హౌస్ మరింత వేడెక్కడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.