Bhumi Pednekar: నాలుగు నెలల్లో భారీగా బరువుతగ్గిన బాలీవుడ్ బ్యూటీ భూమి ఫడ్నేకర్ - ఆమె డైట్ ప్లాన్ ఇదే!
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన టైమ్ లో భారీగా ఉండేది..తన ఫస్ట్ మూవీ దమ్ లగా కే హైషా లో క్యారెక్టర్ కోసం భారీగా పెరిగి ట్రోల్స్ ఎదుర్కొంది. కానీ కేవలం నాలుగంటే నాలుగు నెలల కాలంలో స్లిమ్ గా మారి షాకిచ్చింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనాలుగు నెలల్లో భారీగా బరువు తగ్గటం అంటే మాటలు కాదు..అందుకోసం ఆమె ఫాలోఅయిన డైట్ ప్లాన్, ఫిట్ నెస్ చిట్కాలు చెప్పుకొచ్చింది. ఆపరేషన్లు చేయించుకోకుండా, ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేయకుండానే తగ్గింది భూమి
ఎగ్స్, మిస్సీ రోటీ, ఉప్మా, పోహా, గ్రిల్డ్ చికెన్, మల్టీ-గ్రెయిన్ రోటీలు, రాజ్గిరా ఫుడ్స్ నిత్యం తీసుకునేది. మధ్యాహ్నం పప్పుతో కూడిన భోజనం. సాయంత్రం స్నాక్స్, గ్రీన్ టీతో పాటూ పండ్లు ఉండాల్సిందే. డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకునేది. డిన్నర్ కి కాల్చిన చేపలు, చికెన్, పనీర్, టోపు, ఉడికించిన కూరగాయలు తీసుకునేది.
భారీ వర్కౌట్స్ జోలికి వెళ్లకుండా ఫుడ్ తగ్గంచకుండా...వాకింగ్,రన్నింగ్, స్విమ్మింగ్, ఎరోబిక్స్ వంటి వాటితోనే బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా స్వీట్స్ కి దూరంగా ఉంది. రాత్రిపూట పిండిపదార్థాలు తీసుకోవడం మానేసింది. రోజుకి దాదాపు 7 లీటర్ల నీటిని తాగేది.
ఇలా ఆరోగ్యకరమైన పద్ధతుల ఫాలో అయి మెరుపుతీగలా మారింది బాలీవుడ్ బ్యూటీ భూమి ఫడ్నేకర్...