Kajal Agarwal: అట్టహాసంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ సంగీత్ వేడుక- చీరలో తళుక్కున మెరిసిన టాలీవుడ్ చందమామ కాజల్
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జులై 12న ముఖేష్ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుక అట్టహాసంగా జరగనుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంత్ అంబానీ వివాహాన్ని కనీవిని ఎరుగని రీతిలో జరిపించేందుకు ముఖేష్ అంబానీ భారీగా ఏర్పాట్లు చేయిస్తున్నారు. పెళ్లిలో భాగంగా జరిగే పలు కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి.
తాజాగా ఈ పెళ్లిలో భాగంగా సంగీత్ వేడుక నిర్వహించారు. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. పలువురు సినీ సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.
టాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్.. అనంత్ అంబానీ సంగీత్ వేడుకకు హాజరైంది. తెలుగు నటీమణులలో ఆమె ఒక్కరే ఈ వేడుకలో కనిపించారు.
సంప్రదాయ బద్దంగా చీరను ధరించి కాజల్ ఈ వేడుకలో పాల్గొన్నారు. పింక్ కలర్ శారీ, డిజైనర్ జాకెట్, చక్కటి పచ్చల హారాన్ని మెడలో వేసుకుని అందంగా కనిపించింది.
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ట్రెడిషనల్ వేర్ లో కాజల్ మెరిసిపోతుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.