Dhoni Traditional look: అనంత్ అంబానీ, రాధికల సంగీత్ - ట్రెడిషనల్ వేర్లో స్పెషల్ అట్రాక్షన్‌గా ధోనీ, సాక్షి కపుల్
ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ, నీతా అంబానీల రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జులై 12న వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల వివాహం ఘనంగా నిర్వహించేందుకు అంబానీ కుటుంబం కొన్ని నెలల నుంచి పెళ్లి ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో ముంబైలో శుక్రవారం రాత్రి నిర్వహించిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ సంగీత్ ఫంక్షన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ దంపతులు హాజరయ్యారు.
వివాహమై 14 ఏళ్లు కావొస్తున్నా ఎంఎస్ ధోనీ, సాక్షి ధోనీ జంట ఈ వేడుకలో కొత్త జంటలాగ ఎంతో ఉత్సాహంగా కనిపించారు.
ధోనీ, సాక్షిలు సాంప్రదాయ దుస్తుల్లో కార్యక్రమానికి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధోనీ తెల్లని కుర్తా పైజామా ధరించగా.. సాక్షి లెహంగాలో దర్శనమిచ్చింది.
రెండు రోజుల కిందట ధోనీ న్యూ హెయిర్ స్టైల్ వైరల్ అయింది. ఈ సంగీత్ వేడుకకు హాజరయ్యేందుకు ధోనీ కొత్త లుక్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.