Anasuya Sankranti Look: రంగురంగుల చీరలో 'సంక్రాంతి' ముగ్గులా మెరిసిపోయిన అనసూయ.. పండగవేళ ఫిదా చేసిన ‘రంగమ్మత్త’
అనసూయ భరద్వాజ్.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ మధ్య ఎక్కువగా ట్రోల్స్, కాంట్రవర్సిలతో వార్తల్లో నిలుస్తోంది. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌తో ఫేం సంపాదించుకున్న అనసూయ అందాల యాంకర్ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుల్లితెరపై యాంకర్‌గా చేస్తూనే చాన్స్ దొరికినప్పుడల్లా వెండితెరపై సందడి చేసింది. అలా నటిగా మంచి గుర్తింపు పొందింది. ఈ క్రమంలో రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాలో కీ రోల్ పోషించింది. ఈ చిత్రంలో ఆమె రంగమత్తగా ఆమె చేసిన పాత్రకు మంచి ఆదరణ లభించింది.
ఆ క్రేజ్‌తో వరసగా సినిమాల్లో చాన్స్‌లు కొట్టేసింది. ఈ క్రమంలో లేడీ ఒరియెంటెడ్ సినిమా అవకాశాలు కూడా అందుకుంది. అలా నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా తనకు పేరు తెచ్చిన జబర్దస్త్ షోకు గుడ్‌బై చెప్పి పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం నటిగా వెండితెరపై అలరిస్తున్న అనసూయ మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ మధ్య తరచూ ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్‌కు వెళుతున్న ఆమె పొట్టి పొట్టి డ్రెస్సుల్లో గ్లామర్ షో చేస్తోంది. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ట్రోల్స్ బారిన పడుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఫ్యామిలీతో సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుంది ఈ రంగమత్త. ఇంటి ముందు సంక్రాంతి ముగ్గు పెట్టినప్పటి నుంచి ఫ్యామిలీతో కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు, సంక్రాంతి స్పెషల్ వంటకాలు, తన భర్త, ఇద్దరు కొడుకులతో కలిసి సరదగా గడిపిన ఆనంద క్షణాలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది.
ఈ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సంక్రాంతి నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం నిండాలని, అందరు సంతోషమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ షేర్ చేసింది. ఇక ఈ ఫొటోల్లో అనసూయ సంక్రాంతికి రంగురంగుల ముగ్గుల మధ్య గొబ్బెమ్మలా మెరిసిపోయింది. రంగోళి లాంటి పలుచని చీర కట్టుతో ఫ్యాన్స్‌ని కట్టిపడేంది.
ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. సంక్రాంతి స్పెషల్‌గా రంగురంగుల చీర కట్టిన అనసూయ ఫ్యాషన్ సెన్స్ నెక్ట్స్ లెవల్ అంటూ పొగుడుతున్నారు. పతంగ్ లాంటి చీరలో నెటిజన్ల మనస్సు గాలికి ఎగిరిపోయిందంటూ నెటిజన్లు క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అనసూయ సంక్రాంతి లుక్ ఫ్యాన్స్, నెటిజన్లను ఫిదా చేస్తుంది.