పింక్ డ్రస్సులో ఫొటోలు షేర్ చేసిన హనుమాన్ బ్యూటీ - ఎలా ఉన్నారో చూశారా?
‘హనుమాన్’లో తేజ సజ్జకు జోడీగా నటించిన అమృతా అయ్యర్ తన కొత్త ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ సినిమాలో అమృతా అయ్యర్ చాలా అందంగా కనిపించారు. తనది కథలో చాలా కీలకమైన పాత్ర.
సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ‘హనుమాన్’ సినిమా విడుదల అయింది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర కూడా ‘హనుమాన్’ చాలా మంచి వసూళ్లు సాధిస్తుంది.
పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపితే ‘హనుమాన్’ సినిమా మొదటి రోజే ఏకంగా రూ.25 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే రూ. నాలుగు కోట్ల వరకు వసూళ్లను ‘హనుమాన్’ సాధించడం విశేషం.
ఓవర్సీస్‌లో ‘హనుమాన్’ ఏకంగా 2.5 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది. సంక్రాంతి సినిమాల రేసులో ఓవర్సీస్ మార్కెట్ వరకు ‘గుంటూరు కారం’ సినిమాను కూడా ‘హనుమాన్’ దాటేయడం విశేషం.
వరల్డ్ వైడ్ కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటికే ‘హనుమాన్’ రూ.75 కోట్ల క్లబ్‌లో చేసింది. హిందీ కలెక్షన్లు కూడా ఊపందుకున్నాయి. కాబట్టి లైఫ్ టైం కలెక్షన్లు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు వసూలు చేయవచ్చని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.
‘హనుమాన్’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ను కూడా నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాను 2025లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.