Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Tollywood Movies 2016-2021 : రీమేక్ లతో మళ్లీ 'కిక్' కొట్టిన టాలీవుడ్ స్టార్లు!
ఒక భాషలో హిట్ అయిన కథలను మరో భాషలో రీమేక్ చేయడం అంత ఈజీ కాదు. హిట్ అవ్వడానికి ఎంత పాజిబిలిటీ ఉంటుందో ప్లాప్ అవ్వడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. అందుకే చాలా మంది దర్శకుడు అసలు రీమేక్ లను టచ్ చేయరు. కానీ టాలీవుడ్ లో మాత్రం ఈ ఐదేళ్లలో రీమేక్ కథలతో భారీ హిట్స్ అందుకున్న వారున్నారు. ఆ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appధృవ - తని ఒరువన్ : రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ 'ధృవ' సినిమా తమిళ సినిమా 'తని ఒరువన్'కు రీమేక్ గా తెరకెక్కించారు. హిట్ ఫార్ములా కావడంతో దర్శకుడు సురేందర్ రెడ్డి తన మేకింగ్ తో సినిమాను మరింత స్టైలిష్ గా తెరకెక్కించాడు. ఫైనల్ గా ఈ సినిమాతో స్ట్రాంగ్ హిట్ అందుకొని ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించారు.
ఎవరు - బద్లా : హిందీలో వచ్చిన 'బద్లా' కథను తీసుకొని కొన్ని మార్పులు చేసి తెలుగులో 'ఎవరు' పేరుతో రీమేక్ చేశారు. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
యూటర్న్ - యూటర్న్ : కన్నడలో సూపర్ హిట్ అయిన 'యూటర్న్' సినిమాను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. సమంత పెర్ఫార్మన్స్ తో ఈ సినిమా ఇక్కడ భారీ విజయాన్ని అందుకుంది.
గద్దలకొండ గణేష్ - జిగర్తాండ : వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన 'గద్దలకొండ గణేష్' తమిళ 'జిగర్తాండ' సినిమాకి రీమేక్. చిన్న చిన్న మార్పులు చేసి ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఓ బేబీ - మిస్ గ్రానీ : కొరియన్ భాషలో వచ్చిన 'మిస్ గ్రానీ' సినిమాను మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి 'ఓ బేబీ' పేరుతో తెరకెక్కించారు. నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సామ్ రేంజ్ మరింత పెరిగింది.
రాక్షసుడు - రాక్షసన్ : తమిళంలో వచ్చిన రాక్షసన్ సినిమాను ఫ్రేమ్ టూ ఫ్రేమ్ దింపేసి తెలుగులో 'రాక్షసుడు' పేరుతో విడుదల చేశారు. బెల్లంకొండ హీరోగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. నిజానికి ఈ సినిమాతోనే బెల్లంకొండ సరైన సక్సెస్ అందుకున్నాడని చెప్పొచ్చు.
వకీల్ సాబ్ - పింక్ : చాలాకాలం గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ 'పింక్' సినిమా రీమేక్ గా తెరకెక్కిన 'వకీల్ సాబ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా సమయంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది.
నారప్ప - అసురన్ : ఇక రీసెంట్ గా వెంకీ నటించిన 'నారప్ప' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 'అసురన్'కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా యాజిటీజ్ గా దించేసినా.. వెంకీ తన ఎమోషన్స్ తో సినిమాకి ప్రాణం పోసాడు.