Multibagger Alert: బయింగ్ జోన్లో మల్టీబ్యాగర్ - షేరుకు 700 వరకు లాభం!
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేరు మంగళవారం రూ.2627 వద్ద ముగిసింది. ప్రస్తుత మార్కెట్ ధరకు కొంటే ఒక్కో షేరుపై 26 శాతం రిటర్న్ ఉంటుందని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏడాది నుంచి బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ50ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఔట్ పెర్ఫామ్ చేస్తోంది. ఏడాదిలో నిఫ్టీ 1.4 శాతం రిటర్న్ ఇస్తే హెచ్ఏల్ ఏకంగా 87 శాతం పెరిగింది.
మూమెంటమ్ ఇండికేటర్లు ఆర్ఎస్ఐ, ఎంఎఫ్ఐ వరుసగా 44, 47 జోన్లో ఉన్నాయి. అప్‌సైడ్ మూవ్‌ను సూచిస్తున్నాయి. పైగా లోబీటా స్టాక్ కావడం విశేషం.
సెంట్రల్ గవర్నమెంట్.. డిఫెన్స్ సెక్టార్లో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తోంది. దాంతో రెండేళ్ల నుంచి డిఫెన్స్ సెక్టార్ షేర్లకు రీరేటింగ్ లభించింది. అన్నిటి కన్నా ఎక్కువగా హెచ్ఏఎల్ ర్యాలీ చేసింది.
ప్రస్తుతం ఈ షేరు 40 వారాల మూవింగ్ యావరేజ్ వద్ద సపోర్ట్ తీసుకుంటోంది. పడిపోయిన ప్రతిసారీ ఇక్కడే బౌన్స్ బ్యాక్ అవుతోంది. ఈ లెక్కన రూ.2,370 లెవల్స్‌లో మంచి సపోర్ట్ ఉంది.
ఒకవేళ షేర్లను ఆ జోన్లో కొంటే రూ.3300 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చని జతిన్ గెడియా అంటున్నారు. ఫండమెంటల్స్ చూస్తే 16 శాతం అప్‌మూవ్‌కు ఆస్కారం ఉందని షేర్‌ఖాన్ అంటోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.