India SMEs Listing: ఎస్ఎంఈ లిస్టింగ్‌లో ప్రపంచం 'భారత్' ముందు దిగదుడుపే!

గతేడాదితో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఐపీవో మార్కెట్ డల్‌గా ఉంది. ఈవై అనలిటిక్స్ ప్రకారం ఇప్పటి వరకు గ్లోబల్‌గా కొత్త కంపెనీలు 2.1 బిలియన్ డాలర్లే సమీకరించాయి. గతేడాదితో పోలిస్తే ఇది 62 శాతం తగ్గుదల.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
భారత ఐపీవో మార్కెట్ మాత్రం జోష్‌లో కొనసాగుతోంది. పబ్లిక్ ఇష్యూ వచ్చిన ప్రతి కంపెనీ సూపర్ డూపర్ హిట్ అవుతోంది. ఇప్పటి వరకు 80 కంపెనీలు మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. గతేడాది 60 కంపెనీలు రాగా ఈసారి ఆరు నెలల్లోనే ఈ రికార్డు బద్దలైంది.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు ఎక్కువగా ఐపీవోకు వస్తున్నాయి. 60 శాతం వరకు ఇవే ఉన్నాయి. మిగిలిన ఆరు నెలల్లోనూ మరిన్ని కంపెనీలు పబ్లిక్ నుంచి నిధులు సేకరించనున్నాయి. ఇప్పటికే ఐడియా ఫోర్జ్, పెంటగాన్ రబ్బర్, సైయెంట్ డీఎల్ఎం, సెంకో గోల్డ్ వంటివి రికార్డులు సృష్టించాయి.
భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉండటం, ఏడు శాతం వృద్ధిరేటుతో పయనిస్తుండటం, పరిశ్రమలకు తగినట్టుగా ప్రభుత్వ నిబంధనలు ఉండటం, ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకొనేందుకు ముందుకు రావడం, ప్రభుత్వం ఎస్ఎంఈలను ప్రమోట్ చేస్తుండటంతో ఐపీవో మార్కెట్ పుంజుకుంది.
గ్లోబల్ మార్కెట్లో ప్రథమార్ధం బాగాలేకున్నా ద్వితీయార్ధం మెరుగ్గా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా భారత్ మాత్రం అన్నింటా రికార్డులు బద్దలు కొడుతూ ముందుకెళ్తోంది.