Income Earners: నెలకు రూ.25వేలు జీతమా! కంగ్రాట్స్ - ఇండియా టాప్-10లో ఉన్నట్టే!
మీ వార్షిక ఆదాయం రూ.3 లక్షలు ఉంటుందా? నెలకు రూ.25,000కు మించి సంపాదిస్తున్నారా? అయితే దేశంలో అత్యధిక మొత్తం సంపాదిస్తున్న టాప్-10లో మీరూ ఉన్నట్టే! పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఈ విషయాలను బయటపెట్టింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశంలో ఆర్థిక అసమానతలు ఎంతగా ఉన్నాయో ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. ఆదాయం, లేబర్ మార్కెట్ డైనమిక్స్, ఆరోగ్యం, విద్య, ఇంట్లోని సదుపాయాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు.
సంఘటిత రంగంలో గ్రామీణ ప్రాంతాల్లోని పురుషులు నెలకు సగటున రూ.13,912 సంపాదిస్తుంటే పట్టణాల్లోని పురుషులు రూ.19,194కు ఆర్జిస్తున్నారు. ఇక గ్రామీణ మహిళలు రూ.12,090, పట్టణ మహిళలు రూ.15,031 వరకు సంపాదిస్తున్నారు.
ఏటా అందరూ సంపాదిస్తున్న మొత్తం రూ.18,69,91,00,000 గా ఉంది. అందులో టాప్-1 కేటగిరీలో ఉన్న వారు 1,27,48,00,000 సంపాదిస్తున్నారు. అట్టడుగున 10 శాతం మంది రూ. 32,10,00,000 మాత్రమే ఆర్జిస్తున్నారు. వీరిమధ్య తేడా కనీసం మూడు రెట్లు ఉంది.
మూడు కాలాల్లో సంపాదిస్తున్న మొత్తం ఆదాయంలో బాటమ్ 50% వారు 22 శాతం కలిగివుంటున్నారు. అయితే టాప్ 10 శాతంలో ఉన్నవారు 8.1 శాతంతో వృద్ధి చెందుతుంటే బాటమ్ 50 మాత్రం 3.9 శాతమే వృద్ధి సాధిస్తున్నారు. (All Images PTI, Getty)