EPFO account safety: మీ ఈపీఎఫ్వో ఖాతా భద్రంగా ఉండాలంటే - EPFO చెబుతున్న రూల్స్ ఇవే!
ఈపీఎఫ్వో (EPFO) - ఉద్యోగులందరికీ ఓ ఆర్థిక దన్ను! కానీ చాలామందికి ఈపీఎఫ్వో ఖాతాను భద్రంగా ఉంచుకోవడం తెలియదు. సున్నితమైన ఈపీఎఫ్వో ఖాతా సంఖ్య, పాస్వర్డ్లను తెలిసినవాళ్లకు చెప్పేస్తుంటారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమీ ఈపీఎఫ్వో అకౌంట్ సురక్షితంగా ఉండాలంటే అలాంటి సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని భవిష్య నిధి సంస్థ చెబుతోంది. ఈపీఎఫ్వో ఖాతాను సురక్షితంగా ఉంచుకొనేందుకు కొన్ని వివరాలు తెలియజేసింది.
ఆధార్, పాన్, యూఏఎన్, బ్యాంక్ వివరాలను చందాదారుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో తాము అడగబోమని స్పష్టం చేసింది. ఈపీఎఫ్వో ఖాతాల పాస్వర్డ్లను సెట్ చేసుకొనేటప్పుడు వచ్చే ఓటీపీని ఎవరికీ చెప్పొద్దని సూచించింది.
ఎవరైనా ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా అలాంటి వివరాలు అడిగితే జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపింది.
సాధారణంగా ఉద్యోగం మానేసినప్పుడు లేదా మరో ఉద్యోగానికి మారినప్పుడు మోసగాళ్లు ఆధార్, పాన్, యూఏఎన్, బ్యాంక్ వివరాలను అడుగుతుంటారని భవిష్య నిధి సంస్థ చెబుతోంది. అలాంటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.