Rare Coins Worth Millions: ఈ నాణాలు చాలా కాస్ట్లీ గురూ..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నాణాల్లో అమెరికాలో తయారైన ఫ్లోయింగ్ హెయిర్ సిల్వర్ డాలర్ ఒకటి. ఈ నాణెం 1974 లో తయారు చేశారు. అప్పుడు 1,758 నాణేలు మాత్రమే తయారు చేయగా , ప్రస్తుతం ప్రపంచంలో కేవలం 6 నాణేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒక వేలంలో ఈ నాణేల ప్రస్తుత విలువ రూ.107.57 కోట్లుగా అంచనా వేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణేలలో బ్రాషర్ డౌబ్లూన్ కూడా ఒకటి. దీనిని 1787లో న్యూయార్క్ కు చెందిన సోనీ ఎఫ్రేమ్ బ్రాషర్ రూపొందించారు. ప్రపంచంలో ఇలాంటి నాణేలు కేవలం 7 మాత్రమే ఉన్నాయి. అమెరికాలో ఇదే తొలి బంగారు నాణెం. ఈ ఒక్క నాణెం విలువ రూ.80.89 కోట్లుగా అంచనా వేశారు.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ నాణెం పేరు సెయింట్-గౌడెన్స్ డబుల్ ఈగిల్. 1907 సంవత్సరంలో అమెరికాలో రూపొందింన ఈ నాణెం 1933 వరకు చెలామణిలో ఉంది.ఆ కాలంలోని అత్యంత అందమైన డిజైన్లలో దీనిని ఒకటిగా పరిగణించారు. దీని విలువ రూ.110 కోట్లకు పైమాటే.
ఎడ్వర్డ్ III ఫ్లోరిన్ అనేది కూడా ఖరీదైన నాణేలలో ఒకటి. ఇది ఇంగ్లాండు రాజు మూడవ ఎడ్వర్డ్ కాలం నాటిది. ఇవి మూడు నాణాలు మాత్రమే ఇప్పుడు లభిస్తున్నాయి. వేలంలో ఈ నాణెం విలువ రూ.55.08 కోట్లుగా అంచనా వేశారు.
పెన్నీలు సాధారణంగా రాగి, ఇంకా నికెల్‌తో తయారు చేయబడి ఉంటాయి అయితే యుఎస్‌కి యుద్ధ ప్రయత్నాల కోసం ఆ లోహాలు అవసరమవుతాయి, కాబట్టి అప్పట్లో నాణాలు ఉత్పత్తి చేయడానికి ఉక్కును ఉపయోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సాధారణ స్టీల్ 1943 లింకన్ పెన్నీ విలువ ప్రస్తుతం 204 మిలియన్లు.
సౌదీ అరేబియాలో తయారైన ఉమయ్యద్ గోల్డ్ దీనార్ కూడా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెంగా గుర్తింపు పొందింది. ఉమయ్యద్ సామ్రాజ్య కాలంలో తయారు చేయబడిన ఈ నాణాలు ఇప్పటికి 12 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని విలువ రూ.43.78 కోట్లు.
కెనడియన్ గోల్డ్ మాపుల్ లీఫ్.. మొదటిసారిగా 1979 లో కెనడాలో ముద్రించారు. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నాణెంలో ఒకటి.. ఈ నాణెం 99 శాతం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. సంవత్సరంలో కేవలం ఒక నాణెం మాత్రమే తయారు చేస్తారు. వేలంలో దీని విలువ రూ. 42.95 కోట్లుగా అంచనా వేశారు.
కెనడియన్ గోల్డ్ మాపుల్ లీఫ్‌లో మరో వెరైటీ నాణెం కూడా ఉంది. ఇది ఒక మిలియన్ నాణెం. దీనిని 2007 లో తయారు చేశారు. దీని బరువు 100 కిలోలు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈ నాణేన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నాణెం అని ధృవీకరించింది. ఆరు నాణాలను మాత్రమే ముద్రించగా, ఒక నాణాన్ని 2017న బెర్లిన్ బోడే మ్యూజియం నుంచి దొంగిలించారు.