Pawan Kalyan: కుమార్తెతో కలిసి షార్ సందర్శించిన పవన్ కల్యాణ్
ఇవాళ షార్‌ను సందర్శించిన పపవన్ కల్యాణ్ కుమార్తె ఆద్యతతో కలిసి జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appముందుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్‌కు అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఉదయం 10.15 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు జెసి శుభం బన్సల్, మునిసిపల్ కమిషనర్ తిరుపతి నారపు రెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఆర్డీఓలు నిషాంత్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు.
అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ షార్ చేరుకున్నారు.
షార్‌లో నిర్వహించే జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో కుమార్తె ఆద్యతో కలిసి పాల్గొన్నారు. యువ విద్యార్తుల్లో ఉపగ్రహాల తయారీ ఆలోచన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు.
యువతను అంతరిక్షం రంగం వైపు రప్పించేందుకు ఏటా ఈ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈసారి ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీలోని విద్యాసంస్థల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ఇస్రో.
అక్కడ ప్రతిభ చూపిన వాళ్లను ఎంపి చేసి ఇవాళ జరిగే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా గతేడాది చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా విద్యాసంస్థలుక చెందిన బాలికలను ప్రోత్సహించి ఆజాదీశాట్-2 రూపకల్పన చేసి నింగిలోకి పంపారు.
ఇలా ముంబయి ఐఐటీ విద్యార్థులు ప్రథమ్, బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు పీశాట్, తమిళనాడులోని నూరుల్ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు ఎన్‌ఐయూ శాట్‌ను, చెన్నైలోని సత్యభామ, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాల విద్యార్థులు, కర్ణాటక, తెలంగాణ, ఏపీలోని ఇంజినీరింగ్ విద్యార్థులు ఉపగ్రహాలు రూపొందించారు.
ఇలా పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వం కొంత నిధులు కూడా కేటాయిస్తోంది. ఇలా ఆసక్తి ఉన్న వాళ్లను ఎంపిక చేసేందుకు ప్రత్యేక విధానం ఉంది.
ప్రతి వేసవిలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎంపిక చేసి ఇస్రోలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ రెండు వారాలపాటు ఉంటుంది. విద్యార్థులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకొని ఇస్రో శాస్త్రవేత్తలను సంప్రదించాల్సి ఉంటుంది. మిగతా వివరాలు వాళ్లే అందిస్తారు.