Vizag News: కాలి బూడిదైన విశాఖ బీచ్‌రోడ్‌లోని డైనో పార్క్- భయపెడుతున్న వరుస అగ్ని ప్రమాదాలు
విశాఖ బీచ్‌లో తిరిగే వాళ్లకు, తరచూ విశాఖలో పర్యటించే వాళ్లకు బాగా పరిచయమైన డైనో పార్క్ ఆగ్నికి ఆహుతైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖ నగరంలో బీచ్ రోడ్డు వద్ద ఉన్న డైనోపార్క్లో ఈ ఉదయం ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా దట్టమైన పోగొలతో నిండిపోయింది.
వేగంగా వ్యాపించిన మంటలు డైనో పార్క్ మొత్తాన్ని కాలిబూడిద చేసింది. ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకునే సరికి మొత్తం పార్క్ బుగ్గి అయిపోయింది.
ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు, పార్క్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చాలా వరకు కాలిబూడిదైపోయింది.
విశాఖ నగరంలో ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాల భయాన్ని పుట్టిస్తున్నాయి. ఈ మధ్య మెడికవర్, సెవెన్‌హిల్స్ ఆస్పత్రిల్లో, రైల్వేస్టేషన్లో ప్రమాదాలు జరిగాయి.
ఇప్పటి వరకు జరిగిన అగ్నిప్రమాదాలు గురించి విచారణ జరుగుతున్న లోపే ఇప్పుడు మరో అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది.
వైజాగ్టూర్కు వెళ్లే వాళ్లకు బీచ్‌రోడ్డులో ఇదో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అలాంటి ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
డైనో పార్క్‌లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది... షార్ట్ సర్క్యూట్ కారణమా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో డైనో పార్క్‌లో ఎవరూ లేరని దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
డైనో పార్క్‌లో అగ్ని ప్రమాదం జరిగి.. కళ్లముందే కాలిపోతున్న పార్క్‌ను చూసిన నగరవాసులు, షాక్‌కి గురయ్యారు.