Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Tungabhadra Reservoir: తుంగభద్ర జలాశయాన్ని పరిశీలించిన ఏపీ మంత్రులు- తాత్కాలిక గేటు ఏర్పాటుకు అధికారుల ప్రయత్నాలు
తుంగభద్ర జలాశయాన్ని ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. తాత్కాలిక గేట్ల ఏర్పాటు కోసం సాగుతున్న పనులను సమీక్షించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతుంగభద్ర జలాశయాన్ని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సందర్శించారు. తుంగభద్ర జలాశయాన్ని పరిశీలించారు.
తుంగభద్ర జలాశయం 19వ గేట్‌కు తాత్కాలిక గేటు ఏర్పాటు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. జరుగుతున్న పనులను మంత్రుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రోజుల్లో పనులు పూర్తి అవుతాయో ఆరా తీశారు.
తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. దీంతో కొట్టుకుపోయిన 19వ గేటుకు తాత్కాలికంగా అధికారులు రిపేర్ చేస్తున్నారు. 105 టీఎంసీల కెపాసిటీ ఉన్న డ్యామ్‌లో గేటు కొట్టుకుపోయే ముందు 104 టీఎంసీలు కొనసాగుతూ ఉండేది.
డామ్ గేటు కొట్టుకపోవడంతో కొట్టుకుపోయిన గేట్ల నుంచి సాధారణంగా నీటిని విడుదల చేస్తున్న నీటి కంటే 35 వేల క్యూసెక్కుల నీరు అధికంగా నదిలోకి వెళ్తోంది. ప్రస్తుతం మూడు రోజులుగా నీరు దిగువకు వెళ్తుండడంతో సుమారుగా 15 టీఎంసీల మీద డ్యామ్‌లో మేరు తగ్గింది.
డ్యాం గేటు ఏర్పాటు చేయడానికి మరో మూడు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు లెక్కప్రకారం చూస్తే యావరేజ్‌గా రోజుకి 9 టీఎంసీల నీరు దిగుకు వెళుతుందనుకుంటే సుమారుగా మరో 27 టీఎంసీల వరకు నీరు కిందికి వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు.
image 8
లక్ష క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నామ, విలువైన సాగు తాగు నీటిని కోల్పోతున్నాం: నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు...
పోలవరం ప్రాజెక్టు గేట్ల ఏర్పాటులో కీలకమైన కన్నమ్మ నాయుడు నేతృత్వమంలో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం : నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు...
కొట్టుకుపోయిన 19 వ గేటు వద్ద 5 గేట్లను ఏకకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నాం : నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు...
స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు కష్టతరమైన పని, 1625 అడుగులు నీరువుండగానే గేట్లు అమర్చే ప్రయత్నం చేస్తున్నాం: నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు...
బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడు ప్రత్యమన్యాయ మార్గలు సూచించారు.:ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
మూడు సంస్థలకు గేట్లు నిర్మాణం బాధ్యతలు అప్పగించాం, అత్యంత పురాతన డ్యాం.. రాతి కట్టడం ఎంతో నైపుణ్యత ఉండాలి :ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
నీళ్లు అత్యంత వేగంగా పోతున్నాయి.. టెక్నికల్ గా చాలా ఇబ్బందులు వున్నాయి :ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు కలిసి ఎఫర్ట్స్ పెడుతున్నాం.. ముఖ్యమంత్రి పర్యటన అయ్యాక పనులు ప్రారంభం చేస్తాం:ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
సందర్శకులకు అనుమతి లేదు.. అత్యంత ప్రాధాన్యత తో పనులు చేస్తున్నాం. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు పంటలు సాగుచేస్తున్నారు:ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
వరద కొనసాగుతుండగానే గేట్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం.. గేట్ కొట్టుకుపోయిందని తెలిసిన వెంటనే గుండె గుబేలుమనింది :ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
దేశంలోని ఇంజనీర్లు టీబీ డ్యాం వైపు చూస్తున్నారు, నిపుణులు సూచించిన మార్గాలను కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు పాటించేందుకు సిద్ధంగా ఉన్నాయి:ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
తుంగభద్ర డ్యాం గేట్ కొట్టుకు పోవడం గత పాలకుల నిర్లక్ష్యం.. అందుకే రైతులు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది :రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
నీటి వృథాను అరికట్టడానికి కర్ణాటక అధికారులతో సమన్వయం చేసుకుని చేస్తున్నాము, నీరు వృథా కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం :రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
చంద్రబాబు తన మేధస్సును ఉపయోగించి ఇంజనీరింగ్ నిపుణులు సూచనతో అద్భుతం చేస్తున్నాం:రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
గేటు కొట్టుకపోవడానికి నిర్వహణ లోపమా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు విచారణ చేస్తున్నారు. 33 గేట్లు ఉన్న తుంగభద్ర జలాశయం రెండు రోజు క్రితం విడుదల చేస్తున్న టైంలో 19వ నెంబర్ గేటు కొట్టుకుపోయింది. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
తుంగభద్ర జలాశయం గేటు కొట్టుకుపోవడంలో తప్పిదం ఎవరిది అన్న కోణంలో విచారణ సాగుతోంది.అది తేలే లోపు తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేసే పనులు ముమ్మరం చేశారు అధికారులు
నాన్ రైనీ సీజన్‌లో డ్యాం నిర్వహణను సరిగా జరిగిందా లేదా అని కూడా విచారణ సాగుతోంది. అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారా లేదా అని పరిశీలన సాగింది.
అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని డ్యాం అధికారులు చెబుతున్నారు. చైన్లకు గ్రీసు పూయడం, ఇతర పనులు చేసినట్లు చెబుతున్నారు. జాతీయ డ్యామ్‌లా భద్రత సంస్థ ఇచ్చిన నివేదికను అధికారులు చూపిస్తున్నారు.
డ్యామ్ నిర్మాణాన్ని డ్యాం కెపాసిటీని బట్టి గేట్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క గేటు సుమారు 40 టన్నుల బరువు ఉంటుంది. గేటు జీవితకాలం 40 నుంచి 45 ఏళ్లు ఉంటుంది.
తుంగభద్ర జలాశయం నిర్మాణం నుంచి ఇప్పటివరకు అవే గేట్లు వాడుతున్నారు ఇప్పటివరకు సుమారుగా అంటే 69 ఏళ్లు నుంచి గేట్లు మార్చింది లేదు.
ఎక్కడైనా డ్యాంలకు స్టాప్ లాక్ సిస్టంను అధికారులు ఏర్పాటు చేస్తారు. తుంగభద్ర జలాశయం నిర్మాణం చేపడుతున్న సమయంలో స్టాప్ లాక్ సిస్టం ఏర్పాటు చేయలేదు. 69 ఏళ్ల క్రితం ఈ టెక్నాలజీ లేదని అధికారులు చెబుతున్నారు.
స్టాప్ లాక్ సిస్టం లేకుండానే తుంగభద్ర డ్యాం నిర్మాణం చేపట్టారు. కేవలం చైన్ లింకు ద్వారానే గేట్లు ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు అదే కొంప ముంచిందన్న వాదన ఉంది.
నాలుగేళ్ల క్రితం సీడబ్ల్యూసీ తుంగభద్ర డ్యామ్ పరిశీలించి స్టాప్ లాక్ గేట్లు ఏర్పాటు చేయాలని చూసించింది. అది వీలు కాని పక్షంలో ప్రత్యామ్నాయం ఆలోచన చేయాలని చెప్పింది.
స్టాప్ లాకింగ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం లేకపోతే డ్యామ్‌కే నష్టమని సిడబ్ల్యుసి చెప్పింది. అయితే ఏం చేయాలి. వాటిని ఎలా ఏర్పాటు చేయాలనే సూచనలు మాత్రం చేయలేదని ఓ సీనియర్ ఇంజనీర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తాత్కాలిక గేట్లను అమర్చే పనిలో అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. ఇప్పటికే 19వ గేటు దగ్గర పనులు చురుకుగా చేస్తున్నారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కొంత పనులు ఆలస్యంగా సాగుతున్నాయి.
తాత్కాలిక గేటును పెట్టేందుకు ప్రోసాహళ్లిలోని హిందుస్థాన్ ఇంజనీరింగ్ వర్క్స్ సంస్థతోపాటు కీలకమైన మరికొన్నిసంస్థలను కూడా భాగస్వాములను చేశారు.