Happy Birthday Ratan Tata: హ్యాపీ బర్త్ డే రతన్ టాటా! మంత్రాల్లాంటి మీ మాటలు వింటే విజయం తథ్యం!
ప్రపంచంలోని అత్యుత్తమ వ్యాపార వేత్తల్లో రతన్ టాటా ఒకరు! విలువలతో కూడిన వ్యాపారం చేసేందుకు ఆయనెప్పుడూ ముందుంటారు. కిరాణా సరుకుల నుంచి రయ్యిన దూసుకెళ్లే కార్ల వరకు, గుండు పిన్నీసుల నుంచి ఉక్కు పోత వరకు ఎన్నో వ్యాపారాలను ఆయన విజయవంతంగా నడిపించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటాటా సన్స్ వ్యాపారాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో రతన్ టాటాదే కీలక పాత్ర. ఇతర కంపెనీలను విలీనం చేసుకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా ఆయన ఆలోచించే తీరు భిన్నంగా ఉంటుంది. కంపెనీల్లో పని చేసే ప్రతి కార్మికుడు సంతోషంగా ఉండేందుకు ఆయనెంతో కృషి చేస్తారు.
వ్యాపార వేత్తగానే కాకుండా మెంటార్‌గా రతన్ టాటా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన మాట్లాడే ప్రతి మాటా ఆచితూచి మాట్లాడతారు. ఆయన ప్రతిమాటా అక్షర సత్యంగానే ఉంటుంది. డిసెంబర్ 28న ఆయన 85వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనిచ్చిన కొన్ని స్టేట్మెంట్లు!
'ఇతరులను అనుసరించే వ్యక్తులు కొద్దికాలం మాత్రమే విజయవంతం అవుతారు. ఆ తర్వాత జీవితంలో విజయవంతం కాలేరు', 'మనం ముందుకెళ్లేందుకు ఎత్తు పల్లాలు చాలా ముఖ్యం. ఎందుకంటే సరళరేఖ విజయానికి సూచిక కాదు. ఉదాహరణకు ఈసీజీలో సరళ రేఖ వస్తుందంటే మనం బతికున్నట్టు కాదు కదా' - రతన్ టాటా
'నాకు సరైన నిర్ణయాలపై నమ్మకం లేదు. ముందు నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత వాటిని సరైనవిగా మారుస్తాను', 'సంపద, శక్తి మాత్రమే నా బలం కావు', 'త్వరగా నడవాలనుకుంటే ఒంటరిగా వెళ్లండి. సుదూర గమ్యం చేరాలంటే మాత్రం కలిసి నడవండి' - రతన్ టాటా