Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Fake Hallmarked Gold: అలర్ట్! మీరు కొంటున్నది నకిలీ హాల్‌మార్క్ నగలేమో!
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం మార్కెట్ భారత్! ఏటా కోట్లాది మంది పుత్తడి హారాలు కొనుగోలు చేస్తుంటారు. నచ్చిన డిజైన్లలో సువర్ణం ధరించి మురిసిపోతుంటారు. అయితే మీరు కొంటున్నది నకిలీ హాల్‌మార్క్ ముద్రించిన నగలేమో చూసుకోవాలని ఇండస్ట్రీ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు .
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత మార్కెట్లో నకిలీ హాల్ మార్క్ ముద్రించిన నగలు విస్తృతంగా ఉన్నాయని పుత్తడి పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని పేర్కొన్నాయి. త్వరలోనే నియంత్రణ మొదలవుతుందని ఆశిస్తున్నాయి.
'రిటైల్ బంగారు నగలపై బీఐఎస్ హాల్ మార్క్‌ను తప్పనిసరి చేసింది. అయినా మార్కెట్లో ఇప్పటికీ నకిలీ హాల్‌మార్కింగ్ నగలు చెలామణీలో ఉన్నాయి. స్మగ్లింగ్ చేసిన బంగారంతో నగలు రూపొందించే వాళ్లే నకిలీ హాల్‌మార్కింగ్ వేస్తున్నారు. గ్రాముకు రూ.200-300 వరకు తగ్గించి అమ్ముతున్నారు. ఇది నిజాయతీ, చట్టబద్ధంగా వ్యాపారం చేసేవాళ్లకు సవాల్‌గా మారింది' అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఛైర్మన్ ఎంపీ అహ్మద్ అన్నారు.
దేశంలో బంగారం దిగుమతిపై సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో స్థానిక మార్కెట్లోకి భారీ స్థాయిలో స్మగ్లింగ్ బంగారం వస్తోంది. అనధీకృత తయారీదారులు దీంతో నగలు తయారు చేస్తున్నారు.
ఇలా చేయడం వల్ల ఏటా ప్రభుత్వం వందల కోట్ల రూపాయల పన్ను ఆదాయం నష్టపోతోంది. నకిలీ హాల్ మార్కింగ్ నగలు కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్లు స్వచ్ఛత లేని బంగారం కొనుగోలు చేసే ప్రమాదం ఉంది.