TDP Party Offices: రూ.1,000కి లీజుకి తీసుకుని, చంద్రబాబు కట్టుకున్న పూరి గుడిసెలు ఇవీ - వైసీపీ పోస్టులు వైరల్
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పార్టీ ఆఫీసుల విషయంపై వివాదం రాజుకుంది. వైసీపీ అక్రమంగా ఆఫీసులు నిర్మించుకుందని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, అధికారంలో ఉండగా టీడీపీనే ఇలాంటి అక్రమాలు చేసిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని, గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం రూ.1,000 కి లీజుకి తీసుకుని, చంద్రబాబు కట్టుకున్న పూరి గుడిసె ఇదే ఇది అని వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఏకంగా 99 సంవత్సరాల పాటు టీడీపీకే సొంతం అనేలా ఈ లీజు ద్వారా చట్టవిరుద్ధంగా రాయించుకున్నారని ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ రూ. 25 కోట్లు విలువ చేసే 2 ఎకరాల ప్రభుత్వ భూమిని, చంద్రబాబు గత ప్రభుత్వంలో కేవలం రూ.25వేలకి లీజుకి తీసుకుందని వైసీపీ నేతలు ఆరోపించారు.
ఏకంగా 99 సంవత్సరాల పాటు ఈ స్ధలం టీడీపీకే సొంతం అయ్యేలా చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే లీజులు తీసుకున్నారని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అక్రమంగా పార్టీ ఆఫీసులు కట్టి, తమపై టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందంటున్నారు.
గుంటూరు అరండల్ పేటలో 2015లో టీడీపీ కబ్జా చేసిన స్థలంలో కట్టుకున్న పూరి గుడిసె ఇది అని వైసీపీ పోస్ట్ చేసింది. 100 గజాల స్థలాన్ని కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని.. పక్కనే ఉన్న మరో 1,500 గజాల స్థలాన్ని ఆక్రమించి పార్టీ ఆఫీసు నిర్మించారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌన్సిల్ లో తీర్మానం చేసి టీడీపీ ఆఫీసు నిర్మించారని ఎక్స్ ఖాతాలో వైసీపీ పోస్ట్ చేసింది.