Guppedantha Manasu Angel: 'గుప్పెడంతమనసు' లో ఉన్న ఈ గోదారి పిల్ల మనుని మహా ఇబ్బంది పెట్టేస్తోంది!
గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి, వసుకి మంచి స్నేహితురాలిగా నటిస్తోన్న ఏంజెల్ పేరు అవంతకి. ఈమెది కాకినాడ. ప్రస్తుతం అనుపమకి మేనకోడలిగా మనుకి మరదలిగా సందడి చేస్తోంది. బావా బావా అంటూ మనుని ఓ ఆట ఆడుకుంటోంది
కాలేజీలో నిందపడి బయటకు వెళ్లిపోయిన రిషిని శైలేంద్ర చంపించాలి అనుకుంటాడు. చావు బతుకుల్లో ఉన్న తన స్నేహితుడి రిషిని కాపాడి తనతో తీసుకెళుతుంది ఏంజెల్. మంచి స్నేహితురాలిగా ఉన్న ఏంజెల్ ని భార్యగా మారమని అడుగుతాడు ఆమె తాతయ్య విశ్వనాథం. అప్పుడు రిషి తనకు ఇదివరకే పెళ్లైందని చెప్పడంతో కథ మరో మలుపు తిరుగుతుంది
రిషి-వసుధార కలసిపోయిన తర్వాత ...ఇన్నాళ్లూ తనదగ్గర నిజం దాచారనే కోపంగా దూరంగా వెళ్లిపోతుంది ఏంజెల్. మళ్లీ మను ఎంట్రీతో ఏంజెల్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ పెరిగింది. మనుని బావా అంటూ ఆటపట్టిస్తోంది ఏంజెల్.
రొమాంటిక్ క్రిమినల్స్ అని సినిమాలో నటించింది అవంతిక. ‘అబ్బో నా పెళ్లంట’, 'ఐపీఎల్', 'అంతేలే కథ అంతేలే', 'బీకాంలో ఫిజిక్స్' వంటి సినిమాల్లోనూ మెరిసింది. ఈ మూవీస్ ఏవీ పెద్దగా వర్కౌట్ కాలేదు. గుప్పెడంతమనసు సీరియల్ తో మాత్రం ఫాలోయింగ్ సంపాదించుకుంది ఏంజెల్ అలియాస్ అవంతిక
గుప్పెడంత మనసు సీరియల్‌కి ముందు.. అత్తారింటికి దారేది, పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్స్‌లో నటించింది.