Agnisakshi 2 Serial: నువ్వు తాకితే రాయికూడా పరిమళాలు పంచేనా..స్వచ్ఛమైన మనసుల ప్రేమకథ 'అగ్నిసాక్షి' మళ్లీ వస్తోంది!
ఎవరు వినని జంట కథ ఇది ఎవరు కనని జత ఇది అంటూ సాగే అగ్ని సాక్షి టైటిల్ సాంగ్ ఎందరికో ఫేవరెట్. ఈ పాట కరడుగట్టిన హృదయంలో కూడా ప్రేమ చిగిరింపచేసేలా ఉంటుందంటారు ఈ సీరియల్ కి కనెక్ట్ అయ్యేవారంతా. 2017లో ప్రారంభమైన అగ్నిసాక్షి మూడేళ్లపాటూ సక్సెస్ ఫుల్ గా రన్నైంది. ఇప్పుడు అగ్నిసాక్షి 2 పేరుతో మళ్లీ సందడి చేయబోతున్నారు గౌరీ శంకరుల జంట
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅగ్నిసాక్షి సీరియల్ లో గౌరిగా ఐశ్వర్య పిస్సే, శంకర్ గా అర్జున్ అంబటి నటించారు. వేదాలు చదివిన శంకర్ స్త్రీకి స్వేచ్ఛ ఉండకూడదనే ధర్మాన్ని నమ్ముతాడు. తనని నాశనం చేయాలనే ఉద్దేశంతో చిన్నమ్మ భైరవి అలానే పెంచుతుంది. శివుడిని పూజించే శంకర్...ఓసారి ఆలయంలో ఎదురుపడిన గౌరిపై...తన చేతిలో కుంకుమ పడడం చూసి ఆమే భార్య అని ఫిక్సై..బలవంతంగా ఎత్తుకొచ్చి పెళ్లిచేసుకుంటాడు.
భర్తని రాక్షసుడిలా చూసిన గౌరి..ఆ తర్వాత భైరవి కుట్ర, శంకర్ మంచితనం తెలుసుకుంది. ఇద్దరూ సంతోషంగా ఉండే సమయంలో ఆస్తికోసం భైరవి చంపేస్తుంది. మళ్లీ పుట్టిన ఆ జంట తమ ప్రేమని గెలిపించుకుంటారు...
ఆదిదంపతుల ప్రేమకు నిదర్శనంగా తెరకెక్కిన సీరియల్ అగ్నిసాక్షి. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అంటూ అర్థనారీశ్వర తత్వాన్ని వివరించిన కథ ఇది. రెండు స్వచ్ఛమైన మనసులకి దైవశక్తి తోడుంటుందనే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సీరియల్ అప్పట్లో ప్రేక్షకాదరణ పొందిన సీరియల్స్ లో నంబర్ వన్...
సూపర్ హిట్టైన ఈ జంటతో అదే సీరియల్ పార్ట్ 2 చేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే అగ్నిసాక్షి 2 షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఆషికానా అనే వెబ్ సీరీస్ కి రీమేక్ ఇది... గౌరీ శంకరులుగా ఐశ్వర్య పిస్సే, అర్జున్ అంబటి నటిస్తున్నారు.
రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అగ్నిసాక్షి సీరియల్ వచ్చింది...