YSRCP Samajika Nyaya Bheri Yathra: ఉత్సాహంగా సామాజిక భేరీ యాత్ర- చేసింది చెబుతూనే విపక్షాలపై వైసీపీ విమర్శలు
ఉత్సాహంగా వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయభేరీ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరెండోరోజు విశాఖలో సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సహా పలువురు నాయకుల విగ్రహాలకు పూల మాల వేసి బయల్దేరిన బస్సు యాత్ర
యాత్ర ప్రారంభానికి ముందు బహిరంగ సభలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, వైసీపీ లీడర్లు,
రాష్ట్రంలో సంతృప్తికర పాలన కొనసాగుతోందన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
దళితలను అవమానించిన వ్యక్తి చంద్రబాబన్నారు తమ్మినేని సీతారాం.
దేశంలో ఎక్కడా కూడా ఇలా అణగారిన వర్గాలకు పదవులు ఇచ్చిన సందర్భం లేదన్నారు హోంమంత్రి తానేటి వనిత.
అమలాపురం ఘటనలో టీడీపీ, జనసేన పాత్ర ఉందని స్పష్టమైందన్నారు తానేటి వనిత.
అరెస్టు అయిన వారిలో ఈ రెండు పార్టీల వారే ఉన్నారన్నారు. ఆధారాలతో దొరికిపోయిన చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారన్నారు వనిత.
సామాజిక న్యాయం అందుతుంటే కొన్ని పార్టీలు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు తమ్మినేని సీతారాం.
చంద్రబాబు జరుపుతోంది మహానాడు కాదని... వల్లకాడని అభిప్రాయపడ్డారు తమ్మినేని.
మరో 30 ఏళ్లు జగన్ మోహన్ రెడ్డే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా.
సామాజిక న్యాయం అందుతుంటే కొన్ని పార్టీలు అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు తమ్మినేని సీతారాం.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఇన్నా ఏళ్ల తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తమకు సామాజిక న్యాయం జరిగిందని ఆనందంతో ఉన్నారన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ సామ్రాజాన్ని సృష్టించారన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని.
గ్రామస్థాయి వాలంటీర్ వ్యవస్థ నుంచి మంత్రి వర్గ కూర్పు వరక ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్జీలకు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక సీఎం అని కితాబిచ్చారు విడదల రజని.
మరో 30 ఏళ్లు జగన్ మోహన్ రెడ్డే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా.