Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
YS Jagan: విశాఖలో గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకం: ఏపీ సీఎం జగన్
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న జీ20 సన్నాహక సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనేడు (మార్చి 28), 29 తేదీలలో రెండు రోజులు విశాఖలో జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు హాజరైన సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం అన్నారు.
జి-20 రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం కాగా, తాము అధికారంలోకి వచ్చాక.. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చాం అన్నారు.
మరో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం అన్నారు ఏపీ సీఎం జగన్.
ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్బుల్ పద్ధతులను సూచించాలని ఏపీ సీఎం జగన్ కోరారు.
దీనిపై సరైన మార్గనిర్దేశకత్వం అవసరం. దీనివల్ల మంచి ఇళ్లు పేదలకు సమకూరుతాయి. దీనిపై మీనుంచి మంచి ఆలోచనలు కావాలన్నారు.
సమస్యలకు మంచి పరిష్కారాలు చూపగలగాలి. ఈ అంశంపై మీరు చక్కటి చర్చలు చేయాలన్నారు జగన్
విశాఖలో మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని ఆశిస్తున్నాను అని జి-20 రెండో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు.
ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 57 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
మంగళవారం సాయంత్రం గాళ డిన్నర్ కు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు.
రెండు రోజులు మొత్తం 7 సెషన్స్ (మొదటి రోజు నాలుగు, రెండో రోజు 3), ఒక వర్క్ షాప్ జరుగుతాయని జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సల్మాన్ ఆరోక్య రాజ్ వెల్లడించారు.
image 12
ఈ 30న జీ 20 దేశాలు నుంచి వారికి ట్రైనింగ్ క్లాస్ లు ఉంటాయన్నారు. మిగతా దేశాలు వారు వారి దేశాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారన్నారు.
31వ తేదీన దేశ వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు విద్యార్థులు హాజరవుతారు. విద్యార్థులతో సౌత్ కొరియా, సింగపూర్ దేశాల ప్రతినిధుల నాలెజ్డ్ ఎక్సేంజ్ ఉంటుందన్నారు.