Andhra Pradesh Deputy CM Pawan Kalyan: విజయనగరం జిల్లా గుర్ల గ్రామ అతిసారం బాధితులకు పవన్ పరామర్శ- నీటి కాలుష్యంపై అధికారులకు స్ట్రాంగ్ మెసేజ్
విజయనగరం జిల్లా గుర్ల మండలంలో అతిసారం బారిన పడి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుర్ల గ్రామంలో అతిసారం బారిన పడి ఏడుగురు మృతి చెందారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మరింది.
గుర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని కూడా పవన్ కల్యాణ్ పరామర్శించారు.
అతిసారం బారిన పడి కోలుకుటున్న వారి ఆరోగ్య పరిస్థితులు గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అతిసార ఘటనపై విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో చర్చించి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పవన్.
మృతుల కుటుంబ సభ్యుల్లో చదువుకునే పిల్లలు ఉంటే వారి విద్య బాధ్యతలు ప్రభుత్వం చూసుకుంటుందన్నారు పవన్ కల్యాణ్. ఏడుగురు మృతి చెందడమే కాకుండా పలువురు ఆసుపత్రిపాలు కావడం ఆవేదన కలిగించిందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
గ్రామంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నీటి కాలుష్యం నివారించేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం.
అంతకు ముందు విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని చంపావతి నదిపై ఉన్న రక్షిత మంచి నీటి పథకం పంపింగ్ హౌస్ పరిశీలించారు. అతిసారం ప్రబలిన గుర్ల గ్రామంతోపాటు పరిసర గ్రామాలకు ఈ పంపింగ్ హౌస్ నుంచే నీటి సరఫరా అవుతుందని అధికారులు తెలియజేశారు. నీటి శుద్ధి ప్రక్రియ, రక్షిత మంచి నీరు సమీప గ్రామాలకు అందుతున్న తీరును పవన్‌కి వివరించారు.
నీటి శుద్ధి విషయంలో జాగ్రత్తలు పాటించాలని రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులకు, జల వనరుల శాఖ అధికారులకు పవన్ స్పష్టం చేశారు. పాతకాలంనాటి ఫిల్టర్ బెడ్లు, మంచి నీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అప్‌గ్రేడ్ చేసేందుకు అవసరమైన మరమ్మతులు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
తాగునీటి సరఫరా విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. నిధుల కొరత లేదని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు వినియోగించుకోవాలన్నారు.