US Elections 2024: ఓట్ల కోసం హోటల్లో పని చేసిన ట్రంప్- అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త విన్యాసాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం అచ్చం మన ఇండియన్ పాలిటిక్స్ ను తలపిస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిన్నవయస్సులో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో పనిచేశానని డెమెక్రాట్ల ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హ్యారిస్ చేస్తున్న ఎన్నికల ప్రచారానికి చెక్ పెట్టేలా డొనాల్డ్ ట్రంప్ కూడా హోటల్లో పనిచేసి చూపించారు.
ట్రంప్ పెన్సిల్వేనియాలోని మెక్ డొనాల్డ్స్ ను ఎంచుకున్నారు. ప్రీ ప్లాన్డ్ చేసుకున్న ఎన్నికల ప్రచారం ఫీట్ లో భాగంగా ట్రంప్ మెక్ డొనాల్డ్స్ లో సాధారణ ఉద్యోగిలా వంటపని చేశారు.
ముందుగా ఆయన బంగాళదుంపలతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ వేయించటం నేర్చుకున్నారు. వాటిని నూనెలో వేయించి ఆ తర్వాత వాటిని తనే కస్టమర్లకు సప్లై చేశారు.
ఇందుకోసం జనరల్ గా ఉండే రెస్టారెంట్ మూసివేయించిన ట్రంప్ సిబ్బంది...కార్లలో వచ్చే కస్టమర్లను కూడా ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు.
వలసపౌరులు, స్థానిక అమెరికన్లు, ప్రవాసభారతీయులు ఉండేలా ప్లాన్ చేశారు. తన దగ్గర ఫ్రైంచ్ ఫ్రైస్ కొన్నవారందరితోనూ మాట్లాడిన ట్రంప్..అమెరికా ఫస్ట్ అనే నినాదానికి అందరూ మద్దతుగా ఉండాలని కోరారు.
వలసపౌరులు, స్థానిక అమెరికన్లు, ప్రవాసభారతీయులు ఉండేలా ప్లాన్ చేశారు.
ఈ ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత మాట్లాడిన ట్రంప్...కమలా హ్యారిస్ తను కార్మికులకు దగ్గర మనిషిని అని ప్రూవ్ చేసుకునేందుకు హోటల్లో పనిచేశానని అబద్ధాలు ఆడారని..తను నిజంగానే పనిచేసి చూపించానని కౌంటర్లు విసిరారు ట్రంప్.