In Pics: వైసీపీ కార్యకర్తను పరామర్శించిన జగన్ - తండోపతండాలుగా వచ్చిన జనం
విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు గింజుపల్లి శ్రీనివాసరావు, డేరంగుల గోపి, దేవిశెట్టి రామకృష్ణలను వైఎస్ జగన్ పరామర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజగ్గయ్యపేటలో టీడీపీ మూకల దాడిలో గాయపడి విజయవాడ సన్రైజ్ ఆసుపత్రిలో వైఎస్ఆర్సీపీ నేతలు చికిత్స పొందుతున్నారు.
బెంగళూరు నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జగన్.. అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు.
వైఎస్ జగన్ను చూసేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఆ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటే వేగంగా దిగిపోతుందని.. వెంటనే వైసీపీ ప్రభుత్వం వస్తుందని అన్నారు.
చంద్రబాబు ఇలా భయపెట్టే పనులు చేస్తే, ఆయన్ను టీడీపీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేసే పరిస్థితులు వస్తాయని అన్నారు.
రైతు భరోసా సొమ్ము రెట్టింపు చేసి ఇస్తామని చెప్పి, చంద్రబాబు వాటిని మర్చిపోయారని జగన్ అన్నారు.
బడులకు పోయే పిల్లల్ని విస్మరించి వారి తల్లులకు ఇవ్వాల్సిన నిధులను కూడా ఎగరగొట్టేశారని విమర్శించారు.
వచ్చే శుక్రవారం తాను నంద్యాలకు వెళ్లి అక్కడ హత్యకు గురైన వ్యక్తి కుటుంబాన్ని కలుస్తానని జగన్ చెప్పారు.
ఈ అంశాన్ని దేశ వ్యాప్తంగా హైలైట్ చేస్తామని అన్నారు. హైకోర్టుకే కాకుండా, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి పోరాడతామని జగన్ వార్నింగ్ ఇచ్చారు..