In Pics: మోకాళ్లలోతు బురద నీళ్లలోకి దిగిన జగన్ - ఫోటోలు
విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో తిరుగుతూ వరద బాధితులను పరామర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజగన్తో స్థానికులు తమ బాధల్ని చెప్పుకున్నారు. మూడు రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉందని.. వరద నీరు తగ్గడం లేదని బాధితులు జగన్ తో తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం గురించి కూడా జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలు, తక్షణ సాయం కింద ఆహారం, నీరు గురించి ఆరా తీశారు.
విజయవాడలో సింగ్ నగర్లో వైఎస్ జగన్ పర్యటించగా.. తమ బాధని జగన్ తో బాధితులు చెప్పుకున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలిస్తూ జగన్ ముందుకు సాగారు.
అంతకుముందు విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని జగన్ పరిశీలించారు.
జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ఈ రిటైనింగ్ వాల్ కట్టించారు.
ఈ రోజు వరకూ పులివెందుల పర్యటనలో ఉన్న జగన్.. ఉదయమే ఆ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్నారు. వెంటనే వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు.