Ambedkar Statue Drone Show: అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, స్పెషల్ అట్రాక్షన్‌గా డ్రోన్ షో
ఏపీ ప్రభుత్వం విజయవాడలో ఆవిష్కరించిన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం మొత్తం 206 అడుగుల ఉండగా.. ఇందులో 81 అడుగులు బేస్ ఉంటే, 125 విగ్రహం అడుగులు ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ ప్రభుత్వం ఇందుకోసం 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టింది. ఇందులో అందమైన గార్డెన్‌ను రూపొందించారు.
ప్రత్యేకంగా అందమైన గార్డెన్, మ్యూజికల్ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసేందుకు వీలుగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ విగ్రహం వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా, అలాగే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (Statue of Social Justice ) అంటే విజయవాడ గుర్తుకు వస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు.
మరణం లేని మహానీయుడు విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. మన అడుగుల్లో, మన బతుకుల్లో, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కనిపిస్తూనే ఉంటాడని అన్నారు.
దేశంలో కుల అహంకారం మీద, పెత్తందారీ వ్యవస్థ మీద, వ్యవస్థల దుర్మార్గలపై పోరాటాలకు అంబేద్కర్ స్ఫూర్తినిస్తూనే ఉంటాడని అన్నారు. ఈ విగ్రహం చూసినపుడల్లా...పేదలు, మహిళల హక్కులు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు సీఎం జగన్.
అంబేద్కర్ సమసమాజ భావాలకు నిలువెత్తు రూపమన్నారు. గొంతు వినిపించలేని అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయడానికి కారణం అంబేద్కరేనని జగన్ అన్నారు.
అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ తరువాత డ్రోన్ షో నిర్వహించారు. ఈ డ్రోన్ సో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది
8 మందిని రాజ్యసభకు పంపితే అందులో సగం మంది ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే ఉన్నారని సీఎం జగన్ తెలిపారు. 13 జిల్లాల జడ్పీ ఛైర్మన్లలో బలహీన వర్గాలకు చెందిన 9 మందికి పదవులు ఇచ్చామన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విగ్రహం సామాజికన్యాయ మహాశిల్పం. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొచ్చినట్టు ఇకపై స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే విజయవాడ గుర్తొస్తుంది.
ఈ విగ్రహం మన ప్రభుత్వం ఈ 56 నెలల్లో అనుసరించిన సామాజికన్యాయానికి నిలువెత్తు నిదర్శనం. వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణంలేని మహనీయుడి విగ్రహం
అంబేద్కర్ విగ్రహావిష్కరణ తరువాత లేజర్ షో, డ్రోన్ షో నిర్వహించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదని, దళితులంటే చంద్రబాబుకు నచ్చరని అన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అని జగన్ విమర్శించారు.
పెత్తందారి పార్టీలకు, పెత్తందారి నేతలకు పేదల సంక్షేమం పట్టదన్నారు. పేదలకు అండగా ఉండాలని...ఈ పెత్తందారి పార్టీలకు ఎందుకు ఆలోచన రాదని ప్రశ్నించారు. దళితులకు చంద్రబాబు నాయుడు సెంటు భూమి ఇవ్వలేదని, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదన్నారు.
పేదలు ప్రయాణించే ఆర్టీసీని నిర్వీర్యం చేశారన్న సీఎం జగన్...పేదలు ఆత్మగౌరవంతో బతకొద్దని పెత్తందారులు కోరుకుంటున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవని, వివక్ష అసలే లేదని స్పష్టం చేశారు.
బాణాసంచా కాల్చి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ వేడుకలను సెలబ్రేట్ చేశారు