గన్నవరంలో చంద్రబాబు పర్యటన- ధ్వంసమైన ఆఫీసు, వాహనాల పరిశీలన
గన్నవరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమూడు రోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో ధ్వంసమైన తెలుగుదేశంపార్టీ కార్యాలయాన్ని, తగలబెట్టిన వాహనాలను పరిశీలించారు.
దాడి వివరాలను పార్టీ నేతలు, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు.
గన్నవరంలో పోలీసులు దొంగల్లా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఘటనా స్థలానికి బాధితుల కోసం ఆన్‌డ్యూటీలో వచ్చిన అడ్వకేట్ పై కూడా కేసు పెట్టారని అన్నారు.
పోలీసుల్ని రెచ్చగొట్టి ఇప్పుడెవరు తప్పులు చేసినా... చివరకు పోలీసులకే శిక్షపడుతుందని హెచ్చరించారు. బెదిరిస్తే పారిపోయే పార్టీ తమది కాదని అన్నారు.
వెనుకబడిన వర్గానికి చెందిన దొంతు చిన్నా ఇంటిపై రౌడీలు దాడి చేయడాన్ని ఖండించారు చంద్రబాబు. తాను ఎయిర్ పోర్టుకు వస్తే 1000 మంది పోలీసులను పెట్టారని .. గన్నవరం ఏమైనా పాకిస్తాన్లో ఉందా అని ప్రశ్నించారు.
టీడీపీ ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే అసలు దాడులే జరిగేవి కాదన్నారు. గన్నవరం సిఐ బీసీ వర్గానికి చెందినవాడైతే అట్రాసిటీ కేసులు ఎలా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను అధికారంలోకి రాగానే ఈ ఘటనలపై ఎంక్వైరీ వేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా ఎప్పుడు అడ్డుకోలేదన్నారు.
పార్టీ కార్యాలయంపై దాడులు చేసిన వారిపై ఇప్పటి వరకు విచారణ స్టార్ట్ చేయలేదన్నారు చంద్రబాబు.
దాడులకు గురైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా కుటుంబాన్ని పరామర్శించారు.