Pawan Kalyan: నా సోదరి భువనేశ్వరిని వైసీపీ వాళ్లు అవమానించారు, వంశీకి మీరు ఓటేస్తారా?: పవన్ కళ్యాణ్
దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు కుమార్తె, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తనకు సోదరితో సమానమని, వైసీపీ వాళ్ళు నా సోదరిని అవమానించారు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచంద్రబాబు సతీమణినే వైసీపీ నేతలు అవమానిస్తున్నారంటే, రేపు ఎన్నికల్లో వాళ్లు గెలిస్తే మీ ఇంట్లో మహిళలను కూడా వదలరు. మహిళలు అంటే గౌరవం లేని వైసీపీ వాళ్ళని గెలిపించకండి అని గన్నవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎంపీ ఓటు బాలశౌరికి వేసి, ఎమ్మెల్యేగా మాత్రం తనకు ఓటు వేయాలని కోరుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు పవన్ కళ్యాణ్.
ఆరోజు అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తనను బాధించిందన్నారు.
చంద్రబాబుతో మీకు ఏమైనా సమస్య ఉంటే ఆయనతో తేల్చుకోవాలి, కానీ ఇంట్లో ఆడవాళ్లను కించపరచడం సరికాదని వైసీపీ నేతలకు, సీఎం జగన్ కు సూచించారు.
ఒకవేళ జనసేన శ్రేణులు, కూటమికి సంబంధించిన ఎవరైనా వల్లభనేని వంశీకి ఓటేసినట్లయితే, మహిళల్ని కించపరిచే వ్యక్తికి మీరు మద్దతు తెలిపి ఓటు వేసినట్లు అవుతుందని పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో నాకు సమస్య ఉంటే రాజకీయంగా ఆయనను మాత్రమే విమర్శిస్తాను, ఆరోపణలు చేస్తాను తప్పా, ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డిని కించ పరిచేలా మాట్లాడే వ్యక్తిత్వం తనది కాదన్నారు.
వైసీపీ నేతలు మహిళలు, ఆడబిడ్డల్ని గౌరవించరని, అలాంటి సంస్కారం లేని వాళ్లకు మీ విలువైన ఓటును వేయవద్దు అని పవన్ కళ్యాణ్ సూచించారు.
చింతమనేని ప్రభాకర్ అంటే తనకు చాలా ఇష్టమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు అండగా నిలిచిన వ్యక్తి అన్నారు.
బాలశౌరి, యార్లగడ్డ వంటి వారు వైసీపీలో ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేక జగన్ పార్టీని వీడి బయటకు వచ్చారని.. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
గన్నవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారు.